Anushka Shetty: అన్ని కోట్లా?.. అనుష్కపై రిస్క్ ఎందుకన్నారు.. కానీ
అనుష్క పుట్టిన రోజు సందర్భంగా ప్రత్యేక కథనం. తన కెరీర్ గురించి అనుష్క పంచుకున్న కొన్ని విశేషాలివీ..
ఇంటర్నెట్ డెస్క్: సినిమాపై అవగాహనలేని ఓ యోగా టీచర్.. అనుకోకుండా నటి అయ్యారు. తొలినాళ్లలో భయమేసినా వెనక్కి తగ్గకుండా ముందడుగేశారు. అలా ఒక్కో మెట్టూ ఎక్కుతున్న సమయంలోనే ‘అరుంధతి’ అనే అరుదైన అవకాశం అందుకున్నారు. నాయికా ప్రాధాన్య చిత్రాలకు కొత్త ఊపిరి పోశారు. ఎంతోమంది కథానాయికలకు స్ఫూర్తిగా నిలిచారు. ఇప్పటికే అర్థమై ఉంటుంది ఆమె ఎవరో..! ‘సాషా’గా పరిచయమై ‘సూపర్’ హీరోయిన్ అని అందరితోనూ అనిపించుకున్న అనుష్క పుట్టినరోజు (1981 నవంబరు 7) నేడు. ఈ సందర్భంగా అనుష్క (Anushka) పలు సందర్భాల్లో పంచుకున్న కొన్ని విశేషాలు చూద్దాం..
చేయాల్సింది ఇంకా ఉంది..
‘‘నటిగా నా కెరీర్‌కు సుమారు 17 ఏళ్లు. చాలామంది దీన్ని పెద్ద ప్రయాణంగా భావిస్తారు. కానీ, అది చాలా చిన్నది. బాగా కష్టపడితే కథానాయికలూ పరిశ్రమలో ఎక్కువ కాలం రాణించగలరు. ఆ నమ్మకంతోనే నా ప్రతీ అడుగూ వేశా, వేస్తున్నా. చాలామందిలానే నేనూ అనుకోకుండా ఇండస్ట్రీలోకి వచ్చా. నాకు సినిమాలపై కనీస అవగాహన లేదు. తొలిసారి కెమెరాను ఫేస్ చేసినప్పుడు భయమేసింది. ఆ సమయంలో దర్శకుడు పూరీ జగన్నాథ్ ఎలా చెబితే అలా నటించా. ‘సూపర్’ సినిమా చిత్రీకరణలో నేను చేసిన తప్పులను విశ్లేషించుకుని, తర్వాతి చిత్రాల్లో వాటిని పునరావృతం కాకుండా జాగ్రత్తపడ్డా’’ (Happy Birthday Anushka)
తొలిస్థానం అరుంధతిదే
‘‘ఆ హీరోతో కలిసి నటించాలి.. ఈ పాత్రను పోషించాలి’ అని నేనెప్పుడూ ఓ జాబితా రాసుకోలేదు. మంచి కథల్లో నటించాలని మాత్రమే అనుకునేదాన్ని. నేనెన్ని సినిమాల్లో నటించినా ‘అరుంధతి’ (Arundhati)నే నంబరు వన్. ఏ నటికైనా ఇలాంటి పాత్ర పోషించడం ఓ సవాలు. నేనే కాదు ఈ సినిమాలో ఎవరు నటించినా అద్భుతంగానే ఉండేది. వేరే హీరోయిన్ నటించాల్సిన ఈ పాత్ర చివరిలో నాకు దక్కింది. ‘‘ఇన్ని కోట్ల రూపాయల బడ్జెట్‌తో నాయికా ప్రాధాన్య సినిమా తీస్తారా? అనుష్కపై అంత రిస్క్ చేయడం ఎందుకు?’’ అని చాలామంది వెనక్కిలాగే ప్రయత్నం చేశారు. కానీ, నిర్మాత శ్యాంప్రసాద్‌రెడ్డి ఇవేం పట్టించుకోకుండా నాపై నమ్మకంతో ‘అరుంధతి’ని నిర్మించారు’’ (Happy Birthday Sweety)
కన్ఫ్యూజన్లో..
‘‘అరుంధతి’ సూపర్హిట్కావడంతో ఆ తర్వాత ఎలాంటి సినిమాల్లో నటించాలో? అనే కన్ఫ్యూజన్ ఉండేది. ఆ సందేహంలోనే ‘బిల్లా’ (Billa) చిత్రం చేశా. అరుంధతి/ జేజమ్మలాంటి హుందా పాత్రలు పోషించిన వెంటనే ‘బిల్లా’లో గ్లామర్ రోల్లో కనిపించడం సాహసమే. ఆ చిత్రంలోనే తొలిసారి బికినీలో కనిపించా. నా జీవితంలో ఇబ్బందికర క్షణాలు అవే’’
చదువు చెప్పా..
‘‘నా అసలు పేరు స్వీటీ అని, నేను యోగా టీచర్‌గా పనిచేశానని మీలో చాలామందికి తెలుసు. కానీ, ఓ పాఠశాలలో మూడో తరగతి విద్యార్థులకు పాఠాలు చెప్పాననే విషయం తెలియకపోవచ్చు. బ్యాచిలర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్స్‌లో పట్టా పొందిన తర్వాత కొన్నాళ్లు టీచర్‌గా మారా. తర్వాత యోగాను కెరీర్‌గా ఎంచుకుంటానంటే కుటుంబ సభ్యులు షాక్ అయ్యారు. చివరకు నాకు నచ్చిందే చేయమన్నారు. అలా నా పని నేను చేసుకుంటుంటే 2005లో ‘సూపర్’కోసం దర్శకుడు పూరీ జగన్నాథ్ నుంచి పిలుపు వచ్చింది’’
ఇతరులను అనుకరించొద్దు
‘‘చాలామంది అమ్మాయిలు ‘నేను అనుష్కలా’ ఉండాలి అని, కొందరు అబ్బాయిలు ‘నేను ఫలానా హీరోలా అయితే బాగుండు’ అని ఫీలవుతుంటారు. ఈ విషయంలో వారికి నాదో సలహా.. మీరు ఎవరినీ అనుకరించొద్దు. ఎవరి వ్యక్తిత్వం వారిది.. ఎవరి ప్రతిభ వారిది. మీరు ఏ రంగంలోకి వెళ్లినా, వెళ్లాలనుకుంటున్నా ఆయా ఇండస్ట్రీల్లోని వారితో పోల్చుకోవద్దు. ఎవరూ ఎవరికన్నా గొప్పకాదు. అందరూ సమానమే’’
అయినా ఆయన ప్రోత్సహించారు..
‘‘స్కూల్, కాలేజీల్లో నేను ఎవరితోనూ పెద్దగా మాట్లాడేదాన్ని కాదు. అతికొద్దిమంది స్నేహితులే ఉండేవారు. అలా అని చదువులో నేను టాపర్‌ని కాదు. అయినా మా ప్రిన్సిపల్ నన్ను బాగా ప్రోత్సహించేవారు. సొంత కూతురిలా చూసుకునేవారు. ‘మనం ఎలా ఉన్నా కొందరు మన వ్యక్తిత్వాన్ని ఇష్టపడతారు’ అనే విషయం నాకు అప్పుడు అర్థమైంది’’ అని అనుష్క తన జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు.
అటు అందం.. ఇటు అభినయం
తనకు నటనపై ఆసక్తి లేకపోయినా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన అనుష్క కెరీర్ ఎందరో నటులకు స్ఫూర్తి. ‘విక్రమార్కుడు’, ‘లక్ష్యం’, ‘మిర్చి’ తదితర కమర్షియల్ చిత్రాల్లో అందగా కనిపించిన అనుష్క.. ‘వేదం’, ‘పంచాక్షరి’, ‘నాగవల్లి’, ‘బాహుబలి’, ‘రుద్రమదేవి’, ‘సైజ్ జీరో’ వంటి సాహసోపేతమైన పాత్రలతో మరింతగా మెప్పించారు. తాను ఎంత కష్టపడైనా అనుష్క పాత్రకు పూర్తిస్థాయి న్యాయం చేస్తారన్న దానికి ‘సైజ్ జీరో’ ఓ ఉదాహరణ. బొద్దుగా ఉండేవారు ఎన్ని సమస్యలు ఎదుర్కొంటారో సౌందర్య అనే పాత్రతో కళ్లకు కట్టినట్టి చూపించారు. ‘నంది’ పురస్కారం సహా పలు అవార్డులు అందుకున్న స్వీటీ 2020లో వచ్చిన ‘నిశ్శబ్దం’ చిత్రం తర్వాత మరోసారి తెరపై కనిపించలేదు. ఆమె ప్రస్తుతం ఓ ప్రేమకథా చిత్రంలో నటిస్తున్నారు. అందులో ‘జాతిరత్నాలు’ ఫేం నవీన్ శెట్టి హీరో. ‘రారా కృష్ణయ్య’ ఫేం మహేశ్‌బాబు దర్శకత్వంలో తెరకెక్కుతోంది. ఈ సినిమా గురించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
స్వీటీ చెప్పిన మరికొన్ని ముచ్చట్లు
పారిపోయాడు: నేను ఎత్తుగా, సీరియస్‌గా ఉండటంతో నా వెంటపడేందుకు అబ్బాయిలు సాహసం చేసేవారు కాదు. కానీ, ఓసారి ఓ కుర్రాడు నాకు ప్రపోజ్ చేశాడు. ‘మా నాన్న దగ్గరకు వెళ్లి ఈ విషయం చెప్పు’ అని అనగానే అక్కడి నుంచి పారిపోయాడు. కాలేజీ రోజుల్లోని ఆ సంఘటనను ఎప్పటికీ మర్చిపోలేను.
తప్పకుండా చెబుతా: రిలేషన్షిప్, పెళ్లికి నేను వ్యతిరేకం కాదు. క్రికెటర్‌తో డేటింగ్ చేస్తున్నానని, సినీ పరిశ్రమకు చెందిన వ్యక్తితో ప్రేమలో ఉన్నాననీ వార్తల్లో చూశా. ఒకవేళ నేను ప్రేమలో పడితే దాచుకోను. అన్ని విషయాల్లానే దాని గురించీ తప్పకుండా చెబుతా.
నిజాయతీగా ఉండాలి: ఫలానా లక్షణాలున్న వాడినే పెళ్లి చేసుకోవాలనేం లేదు. కాబోయేవాడు నిజాయతీగా ఉంటే చాలు.
హాబీస్: ప్రయాణాలు చేయడం బాగా ఇష్టం. మూగజీవాలతో ఆడుకుంటూ కాలక్షేపం చేస్తుంటా.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
యువతరం.. వైవిధ్యమే తొలి విజయం: స్టార్ నటులు మెచ్చిన యంగ్ హీరోలెవరంటే?
విభిన్న కథలను ఎంపిక చేసుకుంటూ విజయాన్ని అందుకుంటున్న యంగ్ హీరోలపై ప్రత్యేక కథనం.. -
ఎవరీ అశ్వత్థామ.. కృష్ణుడు అతడికి ఇచ్చిన శాపం ఏంటి?
ప్రభాస్ (Prabhas) కథానాయకుడిగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రూపొందుతున్న సైన్స్ ఫిక్షన్ మూవీ ‘కల్కి 2898 ఏడీ’ (Kalki 2898 AD). ఇందులో ప్రముఖ నటుడు అమితాబ్ బచ్చన్ అశ్వత్థామగా (Ashwathama) కనిపించనున్నారు. -
ఇక్కడ ప్రభాస్, విష్ణు.. అక్కడ రజనీకాంత్, కమల్ హాసన్: వీరి చిత్రాల స్పెషల్ ఏంటంటే?
ప్రముఖ నటులు కొందరు కలిసి నటిస్తున్న చిత్రాలపై ప్రత్యేక కథనం. ఎవరెవరు ఏయే సినిమాల్లో నటిస్తున్నారంటే? -
నాయికలు ‘తెర’ పంచుకుంటే.. వినోదం పెంచినట్టే
త్వరలో విడుదల కాబోయే సినిమాలు ప్రేక్షకులకు రెట్టింపు వినోదాన్ని పంచడానికి సిద్ధమవుతున్నాయి. అందుకు కారణం ఒకే మూవీలో ఇద్దరు/ ముగ్గురు హీరోయిన్లు కలిసి నటిస్తుండటమే.. -
సీనియర్ హీరోయిన్ల జోరు ‘తగ్గేదే లే’.. ఎవరెన్ని సినిమాలతో బిజీగా ఉన్నారంటే?
టాలీవుడ్ సీనియర్ హీరోయిన్లపై ప్రత్యేక కథనం. త్రిష, నయనతార, తమన్నా.. ఇలా ఎవరెవరు ఎన్ని సినిమాలతో సందడి చేసేందుకు సిద్ధంగా ఉన్నారంటే? -
పృథ్వీరాజ్ సుకుమారన్ బెస్ట్ మూవీస్.. ఇప్పుడు ‘ఆడుజీవితం’.. ఇంతకుముందు?
పృథ్వీరాజ్ సుకుమారన్ నటించిన ఉత్తమ చిత్రాలు ఏంటంటే..? -
ఆ అవార్డు అందుకున్న తొలి వ్యక్తిని నేనే అని తెలిసి షాకయ్యా.. అల్లు అర్జున్
నటుడు అల్లు అర్జున్ (Allu Arjun) పుట్టినరోజు నేడు. ఈ సందర్భంగా ఆయనకు సంబంధించిన పలు ఆసక్తికర విశేషాలు. -
రికార్డుల్లోనూ ఫస్టే ఈ నేషనల్ క్రష్.. రష్మిక ఖాతాలో ఘనతలెన్నో!
రష్మిక పుట్టినరోజు సందర్భంగా ఆమె సొంతంచేసుకున్న కొన్ని రికార్డులను చూద్దాం.. -
రామ్ చరణ్ బర్త్‌డే.. ఆయన బాల్యం గురించి ఈ విశేషాలు తెలుసా..?
టాలీవుడ్ ప్రముఖ హీరో రామ్ చరణ్ పుట్టినరోజు నేడు. ఈ సందర్భంగా ఆయన గురించి కొన్ని విశేషాలు.. -
Challenging Roles: పాత్రలకు ప్రాణం పోశారు.. పృథ్వీరాజ్ సుకుమారన్ ఇలా.. విక్రమ్ అలా!
పాత్రలకు ప్రాణం పోసేందుకు మానసికంగా, శారీరకంగా ఎంతగానో శ్రమించిన నటులు, వారి సినిమాల వివరాలివీ.. -
Tollywood Actresses: అగ్ర నాయికలు అలా రూటు మార్చి.. హాట్‌టాపిక్‌గా నిలిచి!
అగ్ర కథానాయిక- వర్ధమాన హీరో కాంబినేషన్లో వచ్చిన సినిమాల విశేషాలు.. -
Actors turned Directors: ధనుష్, ఉపేంద్ర, కంగన.. మళ్లీ మరో కోణాన్ని చూపించేందుకు...
స్వీయ దర్శకత్వంలో నటించిన హీరో/హీరోయిన్‌పై ప్రత్యేక కథనం. ఎవరు ఏ సినిమాతో అలరించేందుకు సిద్ధమయ్యారంటే? -
Alia Bhatt: అందుకు క్లాస్‌లో బెంచీలు తుడిచి.. బ్యాగ్రౌండ్ ఉన్నా ఆడిషన్ ఇచ్చి: అలియా భట్ బర్త్‌డే స్పెషల్
అలియా భట్ పుట్టినరోజు సందర్భంగా ఆమె గురించి పలు విశేషాలు.. -
Mamitha Baiju: గిరిజ, సాయి పల్లవిలా మమితా బైజు.. రాజమౌళి మెచ్చిన ఈ నటి ఎవరు?
యంగ్ హీరోయిన్ మమితా బైజును అగ్ర దర్శకుడు ప్రశంసించడం అందరి దృష్టినీ ఆకర్షించింది. ఎవరీ నటి? -
Comedians as Heros: కమెడియన్లు.. కథానాయకులై.. ఎవరెవరు ఏ సినిమాతో అలరించారంటే?
కమెడియన్లుగా కెరీర్‌ని ప్రారంభించి హీరోగాను సినిమాలు చేస్తున్న నటులపై ప్రత్యేక కథనం.. -
Krystyna Pyszkova: మనిషే కాదు.. మనసూ అందమే: మిస్ వరల్డ్ క్రిస్టినా గురించి ఆసక్తికర విశేషాలివీ
ప్రపంచ సుందరి-2024 కిరీటం దక్కించుకున్న క్రిస్టినా పిస్కోవా గురించి ఆసక్తికర విశేషాలు మీకోసం.. -
Miss World Pageant: తొలుత ‘బికినీ కాంటెస్ట్’గా.. 28 ఏళ్ల తర్వాత భారత్ ఆతిథ్యం.. ‘మిస్ వరల్డ్’ పోటీల సంగతులివీ!
భారత్ ఆతిథ్యంలో 71వ ఎడిషన్ ‘మిస్ వరల్డ్’ పోటీలు జరుగుతున్నాయి. శనివారం విజేతను ప్రకటించనున్నారు. ఈ సందర్భంగా ఈ అందాల పోటీల గురించి పలు ఆసక్తికర విశేషాలు.. -
Sini Shetty: మిస్ వరల్డ్ పోటీలు.. ‘బెస్ట్ డిజైనర్ డ్రెస్’ విజేతగా సినిశెట్టి
మిస్ వరల్డ్ 2024 పోటీల్లో భారత్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న సినిశెట్టి గురించి ఆసక్తికర విశేషాలివీ.. -
Movies in March: మార్చిలో మురిపించే చిత్రాలు.. వరుణ్ తేజ్ అలా.. ‘టిల్లు’ ఇలా!
మార్చిలో విడుదల కానున్న సినిమాలపై ప్రత్యేక కథనం. ఏ హీరో చిత్రం ఏ రోజు ప్రేక్షకుల ముందుకు రానుందంటే? -
Valentine Day: వాలంటైన్స్ డేకు రీరిలీజ్ కానున్న ప్రేమకథా చిత్రాలివే..
వాలంటైన్స్ డే సందర్భంగా గతంలో అలరించిన ప్రేమ కథాచిత్రాలు మరోసారి వినోదాన్ని పంచేందుకు సిద్ధమయ్యాయి. -
తొలి సినిమా ఫ్లాప్.. ‘బండమొహం వీడేం హీరో’ అన్నారు.. రీల్ కెరీర్ To పొలిటికల్ ఎంట్రీ.. విజయ్ లైఫ్ జర్నీ ఇదే!
Actor vijay: తల్లిదండ్రులకు సినీ నేపథ్యం ఉన్నా, నటుడిగా తనకంటూ తమిళనాట గుర్తింపు తెచ్చుకున్న విజయ్.. రాజకీయాల్లోకి అడుగు పెట్టారు. ఈ క్రమంలో ఇప్పటివరకూ ఆయన లైఫ్ జర్నీ ఎలా సాగింది?
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (26/04/24)
-
ముయిజ్జు పార్టీకి ‘సూపర్ మెజార్టీ’.. భారత్ స్పందనిదే...
-
బంగ్లాదేశ్‌ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని
-
ప్రీమియర్ షోలో మెరిసిన తారలు.. అలియా అలా.. రష్మిక ఇలా..
-
ఎట్టకేలకు తెలుగులో ‘OMG2’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
-
‘హీరామండీ’తో నా కల నెరవేరింది: సోనాక్షి సిన్హా