Arya: ‘సార్‌పట్ట’ ట్రైలర్‌ వచ్చేసింది

‘కబాలి’, ‘కాలా’ చిత్రాలతో తెలుగులోనూ విశేష ఆదరణ పొందారు తమిళ దర్శకుడు పా. రంజిత్‌. ఇప్పుడు ఆయన నుంచి ‘సార్‌పట్ట’ అనే చిత్రం రాబోతుంది. ఆర్య కథానాయకుడిగా బాక్సింగ్‌ నేపథ్యంలో ఈ సినిమాని తెరకెక్కించారాయన.

Updated : 13 Jul 2021 13:03 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ‘కబాలి’, ‘కాలా’ చిత్రాలతో తెలుగులోనూ విశేష ఆదరణ పొందారు తమిళ దర్శకుడు పా. రంజిత్‌. ఇప్పుడు ఆయన నుంచి ‘సార్‌పట్ట’ అనే చిత్రం రాబోతుంది. ఆర్య కథానాయకుడిగా బాక్సింగ్‌ నేపథ్యంలో ఈ సినిమాని తెరకెక్కించారాయన. జులై 22 నుంచి ప్రముఖ ఓటీటీ అమెజాన్‌ ప్రైమ్‌లో స్ట్రీమింగ్‌ కానుంది. ఈ నేపథ్యంలో ప్రముఖ నటుడు సూర్య తాజాగా ట్రైలర్‌ని విడుదల చేశారు. ఇప్పటికే విడుదలైన ఆర్య లుక్స్‌, గ్లింప్స్‌ సినిమాపై అంచనాలు పెంచాయి. ఆ అంచనాలు అందుకునేలా ట్రైలర్‌ని తీర్చిదిద్దారు. 

 మద్రాసులో నిర్వహించిన బాక్సింగ్‌ పోటీ సన్నివేశంతో ప్రారంభమయ్యే ఈ ట్రైలర్ ఆద్యంతం ఆసక్తిగా సాగింది. ఏదో పనిచేసుకునే కథానాయకుడు ఆర్య బాక్సింగ్‌ రింగ్‌లో అడుగుపెట్టాలనుకుంటాడు. దాంతో స్థానికంగా రాజకీయం మొదలవుతుంది.  ‘నా కొడుకు బాక్సింగ్‌ చేయవద్దని చెప్పడానికి వాళ్లెవరు? బాక్సింగ్‌ ఏమైనా నీ అబ్బ సొత్తా’ అని కథానాయకుడి తల్లి పాత్ర చెప్పిన డైలాగ్‌ ఆకట్టుకుంటోంది.  ‘వాళ్లకి చెప్పండి.. ఇప్పుడు నా సమయం ఆసన్నమైందని’ అంటూ ఆర్య చెప్పిన డైలాగ్‌తో ట్రైలర్‌ని ముగించిన తీరు సినిమాపై ఆసక్తిని కలిగిస్తోంది. బాక్సర్‌గా ఆర్య రూపురేఖలు కట్టిపడేస్తున్నాయి. నేపథ్య సంగీతం ప్రధాన బలంగా నిలుస్తోంది. మరి ఆర్య బాక్సర్‌గా ఎందుకు మారాడు? ఆయన ఎదుర్కొన్న సవాళ్లు ఏంటి? అనుకున్న విజయం అందుకుంటాడా? తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని