గ్లామర్‌తో కట్టిపడేస్తున్న జూనియర్‌ సమంతలు!

జూనియర్‌ సమంతగా నెట్టింట్లో విపరీతమైన క్రేజ్‌ సంపాదించుకున్నారు టిక్‌టాక్‌ స్టార్‌ అషూరెడ్డి, నటి ఆత్మిక. లుక్స్ పరంగా టాలీవుడ్‌ అగ్రకథానాయిక సమంతకు ఏమాత్రం తీసిపోకుండా...

Published : 28 Feb 2021 09:24 IST

ఒకరు బుంగమూతితో.. మరొకరు లుక్స్‌తో..

ఇంటర్నెట్‌డెస్క్‌: జూనియర్‌ సమంతగా నెట్టింట్లో విపరీతమైన క్రేజ్‌ సంపాదించుకున్నారు టిక్‌టాక్‌ స్టార్‌ అషూరెడ్డి, నటి ఆత్మిక. లుక్స్ పరంగా టాలీవుడ్‌ అగ్రకథానాయిక సమంతకు ఏమాత్రం తీసిపోకుండా ప్రతి ఒక్కరితో జూనియర్‌ సమంత అనిపించుకుంటున్నారు ఈ ముద్దుగుమ్మలు. ప్రస్తుతం ఈ ఇద్దరూ వృత్తిపరంగా తమ, తమ రంగాల్లో ఎంతో బిజీగా ఉంటున్నారు. కాగా, తాజాగా నటి ఆత్మిక ఓ ఫొటోషూట్‌లో పాల్గొన్నారు. అందులో ఆమె చీరకట్టుతో మెరిసిపోవడమే కాకుండా బుంగమూతి పెట్టి యువకుల హృదయాలను కొల్లగొట్టారు. మరోవైపు, అషూరెడ్డి సైతం కొన్ని స్టైలిష్‌ ఫొటోలు షేర్‌ చేశారు. అందులో ఓవైపు నుంచి ఆమె అచ్చంగా సమంతలా కనిపిస్తూ ప్రతిఒక్కర్నీ ఆకర్షించారు. ఇలా ఈ ఇద్దరు ముద్దుగుమ్మలు షేర్‌ చేసిన కొన్ని ఫొటోలు ఇటీవల కాలంలో నెట్టింట్లో వైరల్‌గా మారాయి. వాటిపై ఓ లుక్కేయండి..!









Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని