ATM Review: రివ్యూ: ఏటీఎం.. వీజే సన్నీ ఏ పాత్రలో కనిపించాడంటే?
వీజే సన్నీ, దివి, సుబ్బరాజు, పృథ్వీ తదితరులు ప్రధాన పాత్రల్లో నటించిన వెబ్‌సిరీస్ ‘ఏటీఎం’. హరీశ్ శంకర్ కథ అందించిన ఈ సిరీస్ ఎలా ఉందంటే?
ATM Webseries Review వెబ్ సిరీస్: ఏటీఎం; నటీనటులు: వీజే సన్నీ, పృథ్వీ, సుబ్బరాజు, దివి, దివ్యవాణి తదితరులు; సంగీతం: ప్రశాంత్ ఆర్. విహారి; సినిమాటోగ్రఫీ: మోనిక్ కుమార్ జి; ఎడిటర్: అశ్విన్ ఎస్; సంభాషణలు: విజయ్ ముత్యం, సీపీ ఇమ్మాన్యుయేల్; కథ: హరీశ్ శంకర్; స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: సి. చంద్రమోహన్; నిర్మాణ సంస్థ: దిల్ రాజు ప్రొడక్షన్స్; స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్: జీ 5.
సినీ నటులతో పాటు దర్శక, నిర్మాతలూ ట్రెండ్‌కు తగ్గట్టు వెబ్‌సిరీస్‌లకూ పనిచేస్తున్నారు. అలా దర్శకుడు హరీశ్ శంకర్ (Harish Shankar) కథ అందించగా దిల్ రాజు ప్రొడక్షన్స్ (Dil Raju Productions) సంస్థలో రూపొందిన సిరీస్ ‘ఏటీఎం’ (ATM). కొంతకాలంగా ప్రేక్షకులను ఊరిస్తున్న ఈ సిరీస్ ఓటీటీ ‘జీ 5’ (Zee 5)లో శుక్రవారం విడుదలైంది. మరి, హరీశ్ రాసిన కథేంటి? ఎలా ఉంది? (ATM Webseries Review)..
ఇదీ కథ: జగన్ (వీజే సన్నీ-VJ Sunny)ది హైదరాబాద్‌లోని ఓ బస్తీ. బాల్యంలోనే తల్లిని కోల్పోతాడు. ఏం అడిగినా కొనివ్వట్లేదని, మంచి పాఠశాలకు పంపించట్లేదని తన తండ్రిపై కోపం పెంచుకుంటాడు. తండ్రిలా పేదవాడిగా కాకుండా ధనవంతుడిగా మారాలనుకుంటాడు. అదే ఆలోచన ఉన్న మరో ముగ్గురితో స్నేహం చేస్తాడు. కష్టపడకుండా డబ్బు సంపాదించి, జల్సా చేసేందుకు ఆ నలుగురు చిన్న చిన్న చోరీలు చేస్తుంటారు. కట్‌చేస్తే, పెద్దయ్యాక ఓ కారును కొట్టేస్తారు. రూ. 10 కోట్ల విలువైన వజ్రాలున్నాయని తెలియక దాన్ని అమ్మేస్తారు. వజ్రాలు లేదా రూ. 10 కోట్లు తిరిగి ఇవ్వాలంటూ కారు యజమాని జగన్ గ్యాంగ్‌కు వార్నింగ్ ఇస్తాడు. దాంతో, చేసేదేమీ లేక ఆ నలుగురు మళ్లీ ఓ దోపిడికి పాల్పడతారు. పక్కా ప్లానింగ్‌తో ఏటీఎంలకు నగదును తీసుకెళ్లే సెక్యూరిటీ వ్యాన్‌ను కొట్టేస్తారు. అందులో రూ. 25 కోట్లు ఉంటాయి. ఈ కేసును ఛేదించేందుకు వచ్చిన ఏసీపీ హెగ్డే (సుబ్బరాజు).. స్థానిక బస్తీ కార్పొరేటర్ గజేంద్ర (పృథ్వీ)ను ఎందుకు అరెస్ట్ చేశాడు? జగన్ స్కెచ్‌కు, గజేంద్రకు సంబంధమేంటి? హెగ్డే ఆ డబ్బును రికవరీ చేయగలిగాడా? అన్నది సిరీస్ (ATM Webseries Review) చూసి తెలుసుకోవాల్సిందే.
ఎలా ఉందంటే? ఏటీఎం అనగానే ఠక్కున గుర్తొచ్చేది డబ్బే. టైటిల్ ప్రకటించినప్పుడే ఈ కథ మనీ నేపథ్యంలో సాగుతుందనే విషయం చాలామందికి అర్థమై ఉంటుంది. చెమట చిందించకుండా డబ్బు కోసం పాకులాడితే ఎలాంటి ఇబ్బందులు ఎదురవుతాయో వార్తల్లో, ఎన్నో సినిమాల్లో కనిపించాయి. ఈ సిరీస్ కూడా అదే ఇతివృత్తంగా రూపొందింది. దాంతోపాటు పాలిటిక్స్‌ను తెరపైకి తీసుకొచ్చారు. ప్రారంభ సన్నివేశంతోనే హీరో క్యారెక్టర్ ఎలా ఉంటుంది? అనే విషయం తెలుస్తుంది. కథానాయకుడు తన స్నేహితులతో కలిసి ఏదో నేరం చేశాడని, దాన్నుంచి తప్పించుకునేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాడని అర్థమవుతుంది. హీరో, అతని ఫ్రెండ్స్ ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్, కార్పొరేటర్ గజేంద్ర పాలిటిక్స్, సీఐ ఉమాదేవి (దివ్యవాణి) ఇగో.. సంబంధిత సన్నివేశాలతో తొలి మూడు ఎపిసోడ్లు నెమ్మదిగా సాగుతాయి. ఒకానొక సమయంలో ఉమాదేవి పాత్ర మ్యానరిజం అసహనానికి గురి చేస్తుంది. హీరో, అతని మిత్రుల ఫ్యామిలీ నేపథ్యంలో వచ్చే సీన్స్‌లో ఎమోషన్ అంతగా పండలేదు. సిరీస్‌లోని చాలా పాత్రలు ద్వందార్థాలు పలుకుతాయి. హెగ్డే రాకతో నాలుగో ఎపిసోడ్ నుంచి తర్వాత ఏం జరుగుతుందనే ఆసక్తి మొదలవుతుంది.
దొంగ- పోలీసు ఆటను తెరపై ఎన్నిసార్లు చూసినా బోర్ కొట్టదు కదా. అయితే, ఎత్తుకుపైఎత్తు వేసే తీరుపైనే ఈ కథ విజయం ఆధారపడి ఉంటుంది. ‘ఏటీఎం’ విషయంలో దర్శకరచయితలు సక్సెస్ అయినట్టే. వ్యక్తిగతంగా తనపై కంప్లైట్స్ ఉన్నా వృత్తిపరంగా శభాష్ అనిపించుకునే హెగ్డే.. జగన్ గ్యాంగ్‌ను పట్టుకునేందుకు చిక్కుముడులు విప్పే తీరు ఆకట్టుకుంటుంది. పోలీసు అధికారి ఆలోచనను ముందుగానే పసిగట్టి ఏ క్లూ దొరక్కుండా జగన్ టీమ్ చేసే ప్రయత్నమూ మెప్పిస్తుంది. మధ్యలో, గజేంద్ర పంచ్‌లు, కానిస్టేబుల్ దాస్- హెగ్డేల కాంబినేషన్లో వచ్చే సంభాషణలు నవ్విస్తాయి. అలా సరదాగా సాగుతూనే క్లైమాక్స్‌లో అసలు ట్విస్ట్ రిలీవ్ అవుతుంది. హెగ్డే ఊహించినట్టు జగన్ గ్యాంగ్‌కు సాయం చేసిన వ్యక్తి ఎవరు? గజేంద్రకు, జగన్‌కు మధ్య వైరం ఏంటి? అన్న ప్రశ్నలను సంధిస్తూ సీజన్ 2పై ఆసక్తి రేకెత్తించేలా చేశారు మేకర్స్.
ఎవరెలా చేశారంటే? ‘బిగ్‌బాస్’ విజేతగా ఎంతోమంది హృదయాలను గెలుచుకున్న వీజే సన్నీ.. జగన్ అనే బస్తీ యువకుడి పాత్రలో ఒదిగిపోయాడు. అతని మాస్ లుక్ ఆకట్టుకుంటుంది. అతను లారీపై నిల్చొనే షాట్స్ ‘పుష్ప’ సినిమాను తలపిస్తాయి. హెగ్డే పాత్ర సుబ్బరాజు కెరీర్లో బెస్ట్‌గా నిలుస్తుందనడంలో సందేహం లేదు. ఎప్పటిలానే పృథ్వీ సీరియస్, సరదా మాటలతో అలరించారు. దివ్యవాణి పోషించిన పాత్ర ఏమాత్రం ప్రభావం చూపదు. దివిని ముద్దు సన్నివేశాలకే పరిమితం చేశారనిపిస్తుంది. హీరో స్నేహితులుగా కనిపించిన కృష్ణ బూరుగుల, రవిరాజ్, రోయిల్ శ్రీ ఓకే అనిపిస్తారు. ప్రశాంత్ ఆర్. విహారి అందించిన నేపథ్య సంగీతం కొన్ని సన్నివేశాలకు ప్రధాన బలంగా నిలిచింది. ఏటీఎం వ్యాన్‌ను చోరీ చేసే సీన్లో వచ్చే స్మోక్ ఎఫెక్ట్‌కు సంబంధించి ఛాయాగ్రహణం అదుర్స్ అనిపిస్తుంది. ఎడిటర్ అశ్విన్ కొన్ని పాత్రల నిడివిని కట్ చేసి ఉంటే బాగుండేది. దర్శకుడు ఎంచుకున్న పాయింట్, టేకింగ్ బాగున్నా, కథనాన్ని కాస్త గ్రిప్పింగ్ మార్చి ఉంటే సిరీస్ మరో స్థాయిలో ఉండేది.
బలాలు: + సుబ్బరాజు పాత్ర; + క్లైమాక్స్ ట్విస్ట్; + నేపథ్య సంగీతం
బలహీనతలు: - తొలి ఎపిసోడ్లలో సాగదీత ; - మితిమీరిన ద్వందార్థ సంభాషణలు
చివరిగా: ఈ ‘ఏటీఎం’.. చూడొచ్చు వన్‌టైమ్!
గమనిక: ఈ సమీక్ష సమీక్షకుడి దృష్టి కోణానికి సంబంధించింది. ఇది సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే!
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రివ్యూ: ప్రతినిధి2.. నారా రోహిత్ పొలిటికల్ డ్రామా ఎలా ఉంది?
Prathinidhi 2 Review: నారా రోహిత్ కీలక పాత్రలో నటించిన ‘ప్రతినిధి2’ ప్రేక్షకుల మెప్పించిందా? -
రివ్యూ: ఆవేశం.. రూ.150 కోట్లు వసూలు చేసిన మలయాళ బ్లాక్ బస్టర్ ఎలా ఉంది?
ఫహద్ ఫాజిల్ కీలక పాత్రలో నటించిన మలయాళ సూపర్‌హిట్ మూవీ ‘ఆవేశం’ మెప్పించిందా? -
రివ్యూ: ప్రణయ విలాసం.. ‘ప్రేమలు’ హీరోయిన్ నటించిన సినిమా ఎలా ఉందంటే?
మమితా బైజు, అర్జున్ అశోకన్ తదితరులు ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘ప్రణయ విలాసం’. ‘ఈటీవీ విన్’లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ సినిమా కథేంటంటే? -
రివ్యూ : బాక్.. తమన్నా, రాశీఖన్నాల హారర్ మూవీ ఎలా ఉంది
baak movie review: ‘అరణ్మనై’ సిరీస్‌లో నాలుగో భాగంగా వచ్చిన ‘బాక్’మూవీ సినీ ప్రేక్షకులను మెప్పించిందా? -
రివ్యూ: ఆ ఒక్కటీ అడక్కు.. అల్లరి నరేష్ ఖాతాలో హిట్ పడిందా?
aa okkati adakku review: అల్లరి నరేష్, ఫరియా జంటగా నటించిన కామెడీ ఎంటర్టైనర్ మెప్పించిందా. -
రివ్యూ: శబరి.. వరలక్ష్మీ శరత్‌కుమార్ నటించిన థ్రిల్లర్ ఎలా ఉంది?
sabari movie review in telugu: వరలక్ష్మీ శరత్‌కుమార్, గణేశ్ వెంట్రామన్ కీలక పాత్రల్లో నటించిన ‘శబరి’ మెప్పించిందా? -
రివ్యూ: ప్రసన్నవదనం.. సుహాస్ ఖాతాలో హిట్ పడిందా?
సుహాస్ కీలక పాత్రలో ఫేస్ బ్లైండ్నెస్ కాన్సెప్ట్‌తో రూపొందిన థ్రిల్లర్ మూవీ ఎలా ఉంది. -
రివ్యూ హీరామండి: ది డైమండ్ బజార్.. సంజయ్‌లీలా భన్సాలీ ఫస్ట్ వెబ్‌సిరీస్ ఎలా ఉంది?
భారీ తారాగణంతో సంజయ్‌లీలా భన్సాలీ దర్శకత్వంలో రూపొందిన వెబ్‌సిరీస్ మెప్పించిందా? -
రివ్యూ: క్రాక్.. విద్యుత్ జమ్వాల్ స్పోర్ట్స్ యాక్షన్ ఫిల్మ్ ఎలా ఉందంటే?
విద్యుత్ జమ్వాల్ నటించిన స్పోర్ట్స్ యాక్షన్ మూవీ ‘క్రాక్’. ఓటీటీ ‘డిస్నీ+ హాట్‌స్టార్’లో స్ట్రీమింగ్ అవుతోంది. -
రివ్యూ: రత్నం.. విశాల్ నటించిన యాక్షన్ డ్రామా మెప్పించిందా?
Rathnam movie review: విశాల్ కథానాయకుడిగా హరి దర్శకత్వంలో వచ్చిన యాక్షన్ ఫిల్మ్ తెలుగు ప్రేక్షకులను మెప్పించిందా? -
రివ్యూ: ఆర్టికల్ 370.. యామి గౌతమ్, ప్రియమణి నటించిన పొలిటికల్ థ్రిల్లర్ ఎలా ఉంది?
యామి గౌతమ్, ప్రియమణి నటించిన పొలిటికల్ థ్రిల్లర్ మెప్పించిందా? -
రివ్యూ: మై డియర్ దొంగ.. అభినవ్ గోమఠం నటించిన సినిమా ఎలా ఉందంటే?
అభినవ్ గోమఠం, శాలిని కొండెపూడి ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘మై డియర్ దొంగ’. ఓటీటీ ‘ఆహా’లో విడుదలైన ఈ సినిమా రివ్యూ మీ కోసం.. -
రివ్యూ: సైరెన్.. జయం రవి, కీర్తి సురేశ్ యాక్షన్ థ్రిల్లర్ ఎలా ఉంది?
siren movie review: జయం రవి కథానాయకుడిగా ఆంటోనీ భాగ్యరాజా దర్శకత్వంలో వచ్చిన ‘సైరెన్’ మూవీ తెలుగులో మెప్పించిందా? -
రివ్యూ: పారిజాత పర్వం.. క్రైమ్ కామెడీ థ్రిల్లర్ ఎలా ఉంది?
Paarijatha Parvam Review; చైతన్యరావు, సునీల్, శ్రద్ధాదాస్ కీలక పాత్రల్లో నటించిన క్రైమ్ థ్రిల్లర్ మెప్పించిందా? -
రివ్యూ: ఆట్టం.. మలయాళ సస్పెన్స్ డ్రామా ఎలా ఉంది?
వినయ్, కళాభవన్ షాజాన్, జరీన్ షిహబ్ కీలక పాత్రల్లో నటించిన ‘ఆట్టం’ ఎలా ఉంది? -
రివ్యూ: డియర్.. భార్య గురకపెట్టే కాన్సెప్ట్‌తో రూపొందిన ఈ మూవీ మెప్పించిందా?
DeAr Movie 2024 Review: జీవీ ప్రకాష్‌కుమార్, ఐశ్వర్య రాజేశ్ కీలక పాత్రల్లో నటించిన ‘డియర్’ మూవీ మెప్పించిందా? -
రివ్యూ: శ్రీ రంగనీతులు.. సుహాస్, కార్తీక్ రత్నంల కొత్త మూవీ మెప్పించిందా?
sri ranga neethulu review: తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘శ్రీరంగ నీతులు’ మూవీ ఎలా ఉంది? -
రివ్యూ: బడే మియా ఛోటే మియా.. అక్షయ్, టైగర్ ష్రాఫ్ నటించిన యాక్షన్ థ్రిల్లర్ ఎలా ఉంది?
అలీ అబ్బాస్ జాఫర్ దర్శకత్వంలో అక్షయ్, టైగర్ ష్రాఫ్ కీలక పాత్రల్లో నటించిన ‘బడే మియా ఛోటే మియా’ మెప్పించిందా? -
రివ్యూ: గీతాంజలి మళ్ళీ వచ్చింది.. హారర్ కామెడీ థ్రిల్లర్ ఎలా ఉంది?
అంజలి కీలక పాత్రలో నటించిన హారర్ కామెడీ థ్రిల్లర్ ‘గీతాంజలి మళ్ళీ వచ్చింది’ ప్రేక్షకులను మెప్పించిందా? -
రివ్యూ: లవ్‌గురు.. విజయ్ ఆంటోనీ మూవీ ఎలా ఉంది?
Love Guru Review: విజయ్ ఆంటోని, మృణాళిని రవి కీలక పాత్రల్లో నటించిన న్యూఏజ్ ఫ్యామిలీడ్రామా మెప్పించిందా? -
రివ్యూ: మైదాన్.. అజయ్ దేవ్‌గణ్ కీలక పాత్రలో నటించిన స్పోర్ట్స్ డ్రామా మెప్పించిందా?
భారత ఫుట్‌బాల్ కోచ్ అబ్దుల్ సయ్యద్ రహీం జీవిత చరిత్ర ఆధారంగా రూపొందిన ‘మైదాన్’ మూవీ ఎలా ఉంది?
తాజా వార్తలు (Latest News)
-
కేజ్రీవాల్‌కు ఊరట.. మధ్యంతర బెయిల్ ఇచ్చిన సుప్రీం
-
‘భారత ఎన్నికల్లో మా ప్రమేయం ఉండదు’: రష్యా ఆరోపణలను ఖండించిన అమెరికా
-
నేను రాజకీయాలకు అతీతం.. ఎన్టీఆర్‌కు భారతరత్న ఇవ్వాలి: చిరు
-
వేరే అపార్ట్మెంట్లోకి ప్రవేశించి పోలీసుల కాల్పులు.. ఎయిర్‌ఫోర్స్ ఉద్యోగి మృతి
-
రిఫండ్లు చకచకా.. 6 గంటల్లోనే క్యాన్సిల్ టికెట్ల సొమ్ము!
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM