బ్రహ్మీ మీమ్స్‌తో నగర పోలీస్‌ స్పెషల్‌ వీడియో

సమాజంలో జరుగుతోన్న ఎన్నో మోసాల గురించి ప్రజలకు అవగాహన కల్పించేందుకు పోలీస్‌ శాఖ పలు ప్రత్యేక పద్ధతులు అనుసరిస్తోంది. ఫొటోలు, వీడియోలతో తరచూ ప్రజల్ని అప్రమత్తం చేసిన హైదరాబాద్‌ నగర పోలీస్‌ శాఖ తాజాగా...

Published : 04 Mar 2021 11:01 IST

హైదరాబాద్‌: సమాజంలో జరుగుతోన్న మోసాల గురించి ప్రజలకు అవగాహన కల్పించేందుకు నగర పోలీస్‌ శాఖ పలు ప్రత్యేక పద్ధతులు అనుసరిస్తోంది. ఫొటోలు, వీడియోలతో తరచూ ప్రజల్ని అప్రమత్తం చేసిన హైదరాబాద్‌ నగర పోలీస్‌ శాఖ తాజాగా ఓ స్పెషల్‌ వీడియోతో అందర్నీ ఆకర్షిస్తోంది. ఆన్‌లైన్‌ వేదికగా ఉద్యోగాల పేరుతో జరుగుతోన్న మోసాల వలలో చిక్కుకుని, చివరికి ఆ బాధితులు పోలీసులను ఆశ్రయిస్తున్న ఘటనలను ఇటీవల కాలంలో తరచూ చూస్తున్నాం. అలాంటి మోసాల పట్ల ప్రతిఒక్కరికీ అవగాహన కల్పిస్తూ.. ప్రముఖ హాస్యనటుడు బ్రహ్మానందం నటించిన పలు చిత్రాల్లోని కామెడీ సీన్స్‌తో హైదరాబాద్‌ సిటీ పోలీస్‌ విభాగం ఓ ప్రత్యేక వీడియోని రూపొందించింది. తాజాగా ఆ వీడియోని ట్విటర్‌ వేదికగా షేర్‌ చేసింది. ఉద్యోగాల పేరుతో జరుగుతోన్న మోసాల గురించి ఆ వీడియోలో చూపించారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో అందర్నీ ఆకర్షిస్తోంది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని