Balakrishna: రూ.100కోట్ల క్లబ్‌లోకి ‘భగవంత్‌ కేసరి’..

బాలకృష్ణ తాజా చిత్రం ‘భగవంత్‌ కేసరి’ రూ.100కోట్లకు పైగా వసూళ్లు చేసినట్లు నిర్మాణ సంస్థ ప్రకటించింది. దీంతో ఆయన అభిమానులు సంబరపడుతున్నారు.

Published : 25 Oct 2023 17:31 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: బాలకృష్ణ (Balakrishna) హీరోగా అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన చిత్రం ‘భగవంత్‌ కేసరి’. దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా సూపర్ హిట్‌ టాక్‌ను సొంతం చేసుకుంది. తాజాగా ఈ చిత్రం రూ.100కోట్ల క్లబ్‌లోకి చేరినట్లు నిర్మాణసంస్థ ప్రకటించింది. ఈ విషయాన్ని తెలుపుతూ దసరా విన్నర్ ‘భగవంత్‌ కేసరి’ (Bhagavanth kesari)అంటూ ఓ పోస్టర్‌ను విడుదల చేసింది.

ఆడపిల్లలను సింహాల్లా పెంచాలనే మంచి సందేశంతో రూపొందిన ఈ చిత్రంలోని డైలాగులకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. నేలకొండ భగవంత్‌కేసరి పాత్రలో బాలకృష్ణ తన యాక్టింగ్‌తో అదరగొట్టారు. అలాగే అనిల్‌ రావిపూడి తెరకెక్కించిన యాక్షన్‌ ఎపిసోడ్స్‌ ఆడియన్స్‌ను ఆకట్టుకున్నాయి. దీంతో ఈ సినిమాకు ఊహించిన దాని కంటే మంచి స్పందన వచ్చింది. అక్టోబర్‌ 19న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం తొలిరోజే రూ.30కోట్లకు పైగా వసూళ్లు చేసింది. ఇప్పటి వరకు రూ.104కోట్లను వసూళ్లు చేసినట్లు చిత్రబృందం తెలిపింది. ఇక యూఎస్‌లోనూ ఈ సినిమా వన్‌ మిలియన్‌ డాలర్ల మార్క్‌ను చేరుకుంది. బాలకృష్ణ నటించిన వరుస సినిమాలు రూ.100కోట్ల క్లబ్‌లో చేరడంతో ఫ్యాన్స్‌ ‘ఖుష్’ అవుతున్నారు.

‘లియో’.. థియేటర్‌లో స్క్రీన్‌ చింపేసిన ఎగ్జిబిటర్‌..!

మరోవైపు ఈ సినిమాలో కొత్తగా ఒక పాటను యాడ్‌ చేస్తున్నట్లు చిత్రబృందం తాజాగా వెల్లడించింది. ఈ సినిమా కోసం ‘దంచవేమేనత్త  కూతురా’ పాటను రీమేక్‌ చేశారు. ఇప్పుడు అభిమానులు, ప్రేక్షకుల కోరిక మేరకు దాన్ని యాడ్‌ చేస్తున్నారు. ఇక తాజాగా ఈ సినిమా విజయోత్సవ వేడుకను హైదరాబాద్‌లో నిర్వహించారు. అందులో బాలకృష్ణ మాట్లాడుతూ ‘‘భగవంత్‌ కేసరి’ ఒక విస్పోటనంతో పుట్టింది. ప్రతి మహిళ తనని తాను తర్ఫీదు చేసుకొని ఒక సైనికుడిలా తయారవ్వాలన్న సందేశం ఈ సినిమాతో ప్రేక్షకుల్లోకి వెళ్లింది’’ అన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని