Leo: ‘లియో’.. థియేటర్‌లో స్క్రీన్‌ చింపేసిన ఎగ్జిబిటర్‌..!

‘లియో’ (LEO) స్క్రీనింగ్‌లో అనుకోని సంఘటన చోటుచేసుకుంది. థియేటర్‌ స్క్రీన్‌ను ఓ వ్యక్తి చింపేశాడు.

Published : 25 Oct 2023 15:49 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: విజయ్‌ (Vijay) నటించిన పవర్‌ఫుల్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ ‘లియో’ (LEO). లోకేశ్‌ కనగరాజ్‌ (Lokesh Kanagaraj) దర్శకుడు. ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం ప్రేక్షకులను అలరిస్తోంది. ఈ సినిమా ప్రదర్శనలో తాజాగా అనుకోని సంఘటన చోటుచేసుకుంది. అమెరికాలోని ఓ ప్రముఖ థియేటర్‌లో ‘లియో’ని ప్రదర్శించగా.. గుర్తు తెలియని వ్యక్తి స్క్రీన్‌ను చింపేశాడు. అతడు గతంలో పలు చిత్రాలకు ఎగ్జిబిటర్‌ వర్క్‌ చేశాడని.. ‘లియో’ విదేశీ డిస్ట్రిబ్యూషన్‌ హక్కులు పొందిన ప్రముఖ సంస్థ వల్ల తాను ఇబ్బందులు ఎదుర్కొన్నానని ఆరోపిస్తూ.. ఈ చర్యలకు పాల్పడ్డాడని పలు వెబ్‌సైట్స్‌లో వార్తలు వస్తున్నాయి. దీనికి సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది.

Kushi: నెట్‌ఫ్లిక్స్‌ టాప్ 10లో ‘ఖుషి’.. ఏ స్థానంలో ఉందంటే!

‘మాస్టర్‌’ తర్వాత విజయ్‌ - లోకేశ్‌ కనగరాజ్‌ కాంబినేషన్‌లో వచ్చిన చిత్రమిది. లోకేశ్ సినిమాటిక్ యూనివర్స్‌లో భాగంగా ఈ చిత్రాన్ని తీర్చిదిద్దారు. త్రిష, సంజయ్‌ దత్‌, అర్జున్‌ సర్జా వంటి భారీ తారాగణంతో ఇది సిద్ధమైంది. దసరా కానుకగా అక్టోబర్‌ 19న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈసినిమా అంతటా పాజిటివ్‌ టాక్‌ అందుకుంది. ఇప్పటివరకూ ఈ చిత్రం రూ.400 కోట్లు వసూళ్లు చేసినట్లు తెలుస్తోంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని