Balakrishna: ఆ కుర్చీలో ఉన్న వారెవరైనా మా నాన్నతో సమానం.. అందుకే అలా పిలుస్తా: బాలకృష్ణ

అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో బాలకృష్ణ నటించిన సినిమా ‘భగవంత్‌ కేసరి’ (Bhagavanth Kesari). ఈ చిత్ర యూనిట్‌ తాజాగా అన్‌స్టాపబుల్‌ టాక్‌షోలో సందడి చేసింది.

Updated : 18 Oct 2023 16:26 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: బాలకృష్ణ వ్యాఖ్యాతగా రూపొందిన వినోదాత్మక టాక్‌ షో ‘అన్‌స్టాపబుల్‌ విత్‌ ఎన్‌బీకే’ (Unstoppable with NBK). తెలుగు ఓటీటీ ‘ఆహా’ వేదికగా ఇది స్ట్రీమింగ్‌ అవుతుంది. ఇప్పటికే రెండు సీజన్లతో అలరించిన ఈ కార్యక్రమం ఇప్పుడు తాజా ఎడిషన్‌ ప్రారంభించింది. ఈ సీజన్‌ మొదటి ఎపిసోడ్‌కు ‘భగవంత్ కేసరి’ టీమ్ వచ్చి సందడి చేసింది. ఈ సందర్భంగా ఆ చిత్ర దర్శకుడు అనిల్‌ రావిపూడి, బాలకృష్ణకు (Balakrishna) మధ్య జరిగిన ఓ సంభాషణ అందరినీ ఆకట్టుకుంటుంది.

బాలకృష్ణ తనను గురువు గారు అని పిలవడంపై అనిల్‌ రావిపూడి మాట్లాడుతూ.. ‘మీతో పోలిస్తే నేను చాలా చిన్నవాడిని. ఇప్పుడిప్పుడే ఇండస్ట్రీలో గుర్తింపు తెచ్చుకుంటున్నా. ఇది దర్శకుడిగా నా ఏడో సినిమా. అలాంటిది మీరు నన్ను సెట్‌లో గురువుగారు అని పిలవడం నాకు చాలా ఆనందం వేసింది. డైరెక్టర్‌ స్థానానికి మీరిచ్చిన గౌరవానికి నేను ఫిదా అయ్యాను’ అని చెప్పారు. దీనికి బాలకృష్ణ స్పందిస్తూ.. ‘‘ఏ దర్శకుడైనా నాకు మా నాన్నతో సమానం. డైరెక్టర్‌ కుర్చీలో కూర్చున్న ప్రతివారు నాకు తండ్రిలాంటి వారే. వాళ్లు నా పాత్రకు ప్రాణం పోస్తారు. అందుకే అలా పిలుస్తా’ అని అన్నారు. ఇక శ్రీలీలను (Sreeleela) ఉద్దేశించి బాలకృష్ణ మాట్లాడుతూ.. ‘వచ్చిరాగానే ఫిల్మ్‌నగర్‌ నడిబొడ్డులో జెండా పాతేశావు. డైరెక్టర్లు, నిర్మాతలు, అందరూ అయితే బాలకృష్ణతో సినిమా చేయాలి లేదంటే శ్రీలీలతో చేయాలి అనుకుంటున్నారు. లేదంటే ఈ ఇద్దరినీ కలిపి సినిమా చేయాలి అని అంటున్నారు. నువ్వు చాలా తెలివైన, అల్లరి పిల్లవి. చాలారోజులు ఇండస్ట్రీలో ఉంటావు’ అని సరదాగా అన్నారు.

నా విజయానికి ఆయనే కారణం.. జాతీయ అవార్డుపై అల్లు అర్జున్ పోస్ట్‌

ఇక ‘భగవంత్‌ కేసరి’ విషయానికొస్తే.. అక్టోబర్‌ 19న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా దీనికి సెన్సార్‌ బోర్డు యూ/ఏ సర్టిఫికెట్ ఇచ్చింది. దీని రన్‌టైమ్‌ను 2గంటల 44నిమిషాలు. అలాగే సెన్సార్‌ బోర్డు దీనికి ఎలాంటి కట్స్‌ సూచించలేదు. ఇందులో బాలకృష్ణకు జోడిగా కాజల్‌ అగర్వాల్‌ నటిస్తుండగా ఆయన కూతురి పాత్రలో శ్రీలీల కనిపించనున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని