
RRR: ‘ఆర్‌ఆర్‌ఆర్’ భీమ్.. రామరాజు కొత్త పోస్టర్లు అదుర్స్
ఇంటర్నెట్ డెస్క్: ఎన్టీఆర్, రామ్‌చరణ్ కథానాయకులుగా ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ చిత్రం ‘ఆర్‌ఆర్‌ఆర్’. ఈ సినిమా ట్రైలర్‌ని చిత్ర బృందం డిసెంబర్ 3న విడుదల చేయాల్సి ఉండగా.. కొన్ని కారణాల వల్ల డిసెంబర్ 9కి వాయిదా పడింది. దీంతో సినీ ప్రేక్షకులు కాస్త నిరుత్సాహపడ్డారు. వారిలో జోష్ నింపేందుకు సోమవారం రెండు సర్‌ప్రైజ్‌లు అందించింది. ఎన్టీఆర్, రామ్ చరణ్ పాత్రలకు సంబంధించిన కొత్త పోస్టర్లని విడుదల చేసింది. ఇద్దరు హీరోలు చాలా పవర్‌ఫుల్ లుక్‌లో కనిపించి అభిమానుల్ని ఆకట్టుకునేలా ఉన్నారు.
సుమారు రూ.450 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమాలో రామ్‌చరణ్ అల్లూరి సీతారామరాజుగా, తారక్ కొమురం భీమ్‌గా కనిపించనున్నారు. బాలీవుడ్ నటి ఆలియాభట్ తెలుగులోకి ఎంట్రీ ఇస్తున్నారు. తారక్‌కు జంటగా హాలీవుడ్ నటి ఒలీవియా మోరీస్ సందడి చేయనున్నారు. కీరవాణి స్వరాలు అందిస్తున్నారు. సంక్రాంతి కానుకగా జనవరి 7న ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.