Bholaa Shankar: డబ్బింగ్‌ పనులు.. టీజర్‌ కబుర్లు

చిరంజీవి కథానాయకుడిగా మెహర్‌ రమేష్‌ తెరకెక్కిస్తున్న చిత్రం ‘భోళా శంకర్‌’. రామబ్రహ్మం సుంకర నిర్మాత. తమన్నా కథానాయిక. చిరు చెల్లిగా కీర్తి సురేష్‌ నటిస్తోంది. ఈ సినిమా ఆగస్టు 11న ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే.

Updated : 18 Jun 2023 14:10 IST

చిరంజీవి (Chiranjeevi) కథానాయకుడిగా మెహర్‌ రమేష్‌ తెరకెక్కిస్తున్న చిత్రం ‘భోళా శంకర్‌’ (Bholaa Shankar). రామబ్రహ్మం సుంకర నిర్మాత. తమన్నా కథానాయిక. చిరు చెల్లిగా కీర్తి సురేష్‌ నటిస్తోంది. ఈ సినిమా ఆగస్టు 11న ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే నిర్మాణాంతర పనుల్ని వేగవంతం చేసింది చిత్ర బృందం. ఇందులో భాగంగా కీర్తి సురేష్‌ తన పాత్రకు డబ్బింగ్‌ ప్రారంభించింది. ఈ విషయాన్ని ఆమె ట్విటర్‌ వేదికగా స్వయంగా తెలియజేసింది. ఈ సందర్భంగా డబ్బింగ్‌ స్టూడియోలో దర్శకుడు మెహర్‌తో కలిసి దిగిన ఫొటోల్ని అభిమానులతో పంచుకుంది. అలాగే త్వరలో ఈ చిత్ర టీజర్‌ రానున్నట్లు తెలిపింది. మాస్‌ యాక్షన్‌ అంశాలతో నిండిన ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ ఇది. ఇందులో చిరు టాక్సీ డ్రైవర్‌గా మాస్‌ స్టైలిష్‌ లుక్‌లో కనిపించనున్నారు. సుశాంత్‌ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం: మహతి స్వర సాగర్‌, ఛాయాగ్రహణం: డడ్లీ.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని