BRO: దాన్ని ముందే ఊహించాం: ‘బ్రో’ సెలబ్రేషన్స్‌లో సాయిధరమ్‌ తేజ్‌

పవన్‌ కల్యాణ్‌, సాయిధరమ్‌ తేజ్‌ కలిసి నటించిన ‘బ్రో’ సినిమాకి మంచి టాక్‌ వచ్చింది. ఈ సందర్భంగా చిత్ర బృందం వేడుకలు నిర్వహించింది.

Published : 28 Jul 2023 19:24 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: అగ్ర నటుడు, తన మామయ్య పవన్‌ కల్యాణ్‌ (Pawan Kalyan)తో కలిసి ‘బ్రో’ (BRO) సినిమాలో నటించడం, అది విడుదలవడం కలలా ఉందని సాయిధరమ్‌ తేజ్‌ (Sai Dharam Tej) ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఈ సినిమా శుక్రవారం విడుదలైన సంగతి తెలిసిందే. విడుదలైన అన్ని చోట్ల మంచి టాక్‌ వచ్చిన నేపథ్యంలో చిత్ర బృందం హైదరాబాద్‌లో వేడుకలు చేసింది. అనంతరం, ప్రెస్‌మీట్‌లో పాల్గొని ప్రేక్షకులకు థ్యాంక్స్‌ చెప్పింది. సాయిధరమ్‌ తేజ్‌, హీరోయిన్లు కేతిక శర్మ (Ketika Sharma), ప్రియా ప్రకాశ్‌ వారియర్‌ (Priya Prakash Varrier), దర్శకుడు సముద్రఖని (Samuthirakani) పాల్గొన్నారు.

‘‘నా గురువు (పవన్‌ కల్యాణ్‌)తో కలిసి ఓ సినిమాలో నటించడమే కాకుండా అది విడుదలైందనే విషయాన్ని నమ్మలేకపోతున్నా. సినిమా విజయం సాధించినందుకు ఆనందంగా ఉంది. బ్లాక్‌బ్లస్టర్‌ సక్సెస్‌ని ప్రేక్షకులు అందిస్తారని ముందే ఊహించాం. సినిమాకు కావాల్సిన ప్రతిదీ అందించిన నిర్మాతలు టీజీ విశ్వప్రసాద్‌, వివేక్‌ కూచిభొట్లకు కృతజ్ఞతలు. మేమంతా 100 శాతం ఔట్‌ఫుట్‌ ఇవ్వగలిగామంటే దానికి కారణం త్రివిక్రమ్‌, కల్యాణ్‌ మామయ్య. స్క్రీన్‌ప్లే, సంభాషణలను త్రివిక్రమ్‌ అద్భుతంగా రాశారు. దానికి తగ్గట్టు సముద్రఖని డైరెక్షన్‌ చేశారు. కల్యాణ్‌ మామయ్య సెట్‌లోకి అడుగుపెట్టగానే మా అందరిలో ఎనర్జీలో వచ్చేది’’ అని పేర్కొన్నారు.

రివ్యూ: బ్రో

సముద్రఖని మాట్లాడుతూ.. ‘‘చాలా సంతోషంగా ఉంది. మేమంతా అనుకున్నదే జరుగుతోంది. చిత్రీకరణ విషయంలో నాకు సహకరించిన నిర్మాతలకు ధన్యవాదాలు. త్రివిక్రమ్‌ చూపించిన ప్లే గ్రౌండ్‌లో ప్రతి ఒక్కరం పర్‌ఫెక్ట్‌గా ఆడుకున్నాం. పవన్ కల్యాణ్‌  అంకితభావంతో పనిచేశారు’’ అని అన్నారు. ‘‘కొన్ని సినిమాలు ఓ సంవత్సరం గుర్తుంటాయి. కొన్ని దశాబ్దాలపాటు గుర్తుంటాయి. ఈ సినిమా చిరస్థాయిగా ఉంటుంది. పవన్‌ కల్యాణ్‌తో ఈ చిత్రాన్ని నిర్మించినందుకు ఆనందంగా, మరోవైపు గర్వంగా ఉంది’’ అని నిర్మాత విశ్వప్రసాద్‌ తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని