మీలాగే నేను కూడా ఎదురుచూస్తున్నాను: చిరంజీవి

‘వకీల్‌సాబ్‌’ కోసం అందరిలాగే తాను కూడా ఎదురుచూస్తున్నానని మెగాస్టార్‌ చిరంజీవి అన్నారు. పవన్‌కల్యాణ్‌ ప్రధానపాత్ర పోషించిన ఈ చిత్రం ఏప్రిల్‌ 9న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో సినిమాను ఉద్దేశిస్తూ ఒక ట్వీట్‌ చేశారు. ఆ ట్వీట్‌లో చిరు..

Published : 08 Apr 2021 17:12 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ‘వకీల్‌సాబ్‌’ కోసం అందరిలాగే తాను కూడా ఎదురుచూస్తున్నానని మెగాస్టార్‌ చిరంజీవి అన్నారు. పవన్‌కల్యాణ్‌ ప్రధానపాత్ర పోషించిన ఈ చిత్రం ఏప్రిల్‌ 9న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో పవన్ను‌ ఉద్దేశిస్తూ ఒక ట్వీట్‌ చేశారు. ఆ ట్వీట్‌లో చిరు తన తమ్ముడు పవన్‌కల్యాణ్‌కు జుట్టు సరిచేస్తున్న పాత ఫొటో కూడా పంచుకున్నారు. ‘చాలాకాలం తర్వాత పవన్‌కల్యాణ్‌ను వెండితెర మీద చూడటానికి మీలాగే నేను కూడా ఎదురుచూస్తున్నాను. అమ్మ, కుటుంబసభ్యులతో రేపు సాయంత్రం థియేటర్‌లో వకీల్‌సాబ్‌ చూడనున్నాం. సినిమా చూసిన తర్వాత నా స్పందన మీతో పంచుకోవాలని ఎంతో ఆత్రుతగా ఉన్నాను’ అని ఆయన ఆ ట్వీట్‌లో పేర్కొన్నారు.

హిందీలో మంచి విజయం సాధించిన ‘పింక్‌’ చిత్రానికి రీమేక్‌ ఈ ‘వకీల్‌సాబ్‌’. ఈ చిత్రాన్ని పవన్‌కల్యాణ్‌ హీరోగా డైరెక్టర్‌ వేణు శ్రీరామ్‌ తెరకెక్కించారు. పవన్‌ సరసన శ్రుతిహాసన్‌ నటించారు. నివేదా థామస్‌, అంజలి, అనన్య కీలక పాత్రలు పోషించారు. తమన్‌ సంగీతం అందించారు. బోనీ కపూర్‌ సమర్పణలో దిల్‌రాజు, శిరీష్‌ సంయుక్తంగా నిర్మించారు. ఇప్పటికే విడుదలైన చిత్ర ట్రైలర్‌ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. మరోవైపు మెగాస్టార్‌ చిరంజీవి సైతం ‘ఆచార్య’తో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమయ్యారు. ఆ సినిమా మే 13న విడుదల కానుంది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని