
Cinema News: నాన్నే మా స్ఫూర్తి
ఫాదర్స్‌డే విషెస్ తెలిపిన సెలబ్రిటీలు
హైదరాబాద్: ఫాదర్స్ డేని పురస్కరించుకుని పలువురు టాలీవుడ్ స్టార్ హీరోహీరోయిన్లు తమ తండ్రులకు శుభాకాంక్షలు తెలిపారు. ‘నాన్నా.. నువ్వు మా స్ఫూర్తి’ అని పేర్కొంటూ మధురజ్ఞాపకాలను పంచుకున్నారు.
‘మా నాన్నకి కోపం ఎక్కువ.. ఆ కోపానికి ప్రేమ ఎక్కువ.. ఆ ప్రేమకి బాధ్యత ఎక్కువ. తమ కలల్ని పక్కనపెట్టి కుటుంబ బాధ్యతలు నెరవేర్చటం కోసం ప్రతిరోజూ కష్టపడే నాన్నలందరికీ ఫాదర్స్ డే శుభాకాంక్షలు’ - చిరంజీవి
‘నా హీరో, ఎల్లప్పుడూ నన్ను గైడ్ చేసే చిరుదీపం, స్ఫూర్తి.. ఇవి మాత్రమే కాదు వీటన్నింటినీ మించిన వ్యక్తి మీరు. హ్యాపీ ఫాదర్స్ డే నాన్న’ - మహేశ్‌బాబు
‘మా సామ్రాజ్యానికి రాజైన మహేశ్‌కు ఫాదర్స్ డే శుభాకాంక్షలు. మనకెంతో ఇష్టమైన వారు ఎప్పటికీ మనల్ని వదిలి వెళ్లరు. మన కంటికి కనిపించకపోయినప్పటికీ వాళ్లు మనతోనే ఉంటారు. మన వెనుకే వస్తారు. డాడీ.. ప్రతి రోజూ నిన్ను గుర్తు చేసుకోవడం బాగుంది. కానీ నిన్ను మిస్ కావడం బాధగా ఉంది. ఐ లవ్ యూ డాడీ ’- నమ్రత
‘నా జీవితంలో ఎన్నో మధురమైన జ్ఞాపకాలు మీతోనే ఉన్నాయి. మన కుటుంబంలోని ప్రతి ఒక్కరికీ నువ్వు బెస్ట్ ఫ్రెండ్ .. అలాగే అందరిలో నువ్వు ప్రేరణ నింపావు. మీ ప్రేమ, ప్రోత్సాహం లేకపోతే ఈరోజు మేము ఈ స్థాయిలో ఉండేవాళ్లం కాదు. థ్యాంక్యూ డాడీ. వి లవ్ యూ’ - మంచు లక్ష్మి
‘ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి తండ్రికీ హ్యాపీ ఫాదర్స్ డే’ - అల్లుఅర్జున్
‘మన తండ్రీకొడుకుల అనుబంధం ఎన్నో సంవత్సరాల క్రితమే స్నేహబంధంగా మారినందుకు ఎంతో ఆనందిస్తున్నాను’ - వరుణ్ తేజ్
‘నాన్నా.. మీ గొప్పతనం గురించి చెప్పడానికి ఒక జీవితకాలం సరిపోదు. ఎల్లప్పుడు నాకు తోడుగా ఉన్నందుకు ధన్యవాదాలు’ - శ్రీజ
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.