Project K: ‘ప్రాజెక్ట్‌ కె’ గ్లింప్స్‌.. అంచనాలకు మించి..

ప్రభాస్‌ (Prabhas) - దీపికా పదుకొణె (Deepika Padukone) - అమితాబ్‌ బచ్చన్‌ (Amitabh Bachchan) ప్రధాన పాత్రధారులుగా నటిస్తోన్న చిత్రం ‘కల్కి 2898 ఏడీ’ (Kalki 2898 AD). తాజాగా ఈ సినిమా గ్లింప్స్‌ను చిత్రబృందం సినీ ప్రియులతో పంచుకుంది.

Updated : 21 Jul 2023 14:11 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: పాన్‌ ఇండియా స్టార్‌ ప్రభాస్ (Prabhas) నటిస్తోన్న రీసెంట్‌ బిగ్గెస్ట్ ప్రాజెక్ట్‌ ‘కల్కి 2898 ఏడీ’ (Kalki 2898 AD). నాగ్‌ అశ్విన్‌ దర్శకుడు. భారీ బడ్జెట్‌తో హాలీవుడ్‌ స్థాయిలో రూపుదిద్దుకుంటోన్న ఈ సినిమా టైటిల్‌, గ్లింప్స్‌ను చిత్రబృందం తాజాగా విడుదల చేసిన విషయం తెలిసిందే. అమెరికాలో జరుగుతోన్న ప్రతిష్ఠాత్మక ‘శాన్‌ డియాగో కామిక్ కాన్‌’ (San Diego Comic Con) వేదికగా విడుదల చేసిన ఈ గ్లింప్స్‌ చూసి.. సినీ ప్రముఖులు ఫిదా అవుతున్నారు. ‘ప్రాజెక్ట్‌ కె’ (Project K) టీమ్‌ను మెచ్చుకుంటూ సోషల్‌మీడియాలో ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

‘‘ఇది ఎవరి ఊహలకు అందని విధంగా ఉంది. దీనిని చూసి థ్రిల్‌కు గురయ్యా. మాటలు రావడం లేదు. డియర్‌ నాగ్‌ అశ్విన్‌.. నీకు నా హృదయపూర్వక నమస్కారాలు’’ - హరీశ్‌ శంకర్‌

‘‘త్వరలో మన ముందుకు రానున్న ఈసినిమా కోసం ఆత్రుతగా ఎదురుచూస్తున్నా. నాకెంతో ఇష్టమైన నటీనటులు చాలామంది ఒకే ఫ్రేమ్‌లో ఉన్నారు’’  - విజయ్‌ దేవరకొండ

Prabhas: రామ్‌ చరణ్‌తో కలిసి కచ్చితంగా సినిమా చేస్తాను: ప్రభాస్‌

‘‘వావ్‌.. వావ్‌.. వావ్‌.. ‘ప్రాజెక్ట్‌ కె’ గ్లింప్స్‌ చూస్తుంటే మతిపోతోంది. ప్రభాస్‌ అన్నకు సినిమాపై ఉన్న ప్రేమ, నాగ్‌ అశ్విన్‌.. విజన్‌, అభిరుచి ప్రతి ఫ్రేమ్‌లోనూ కనిపిస్తోంది. నాకెంతో ఇష్టమైన స్వప్న, ప్రియాంక, వైజయంతి ఫిల్మ్స్‌ బ్యానర్‌.. ల్యాండ్‌ మార్క్‌ ఫిల్మ్‌ను క్రియేట్‌ చేస్తున్నారు’’ - నవీన్‌ పొలిశెట్టి

‘‘వరల్డ్‌ క్లాస్‌ అవుట్‌పుట్‌. ప్రభాస్‌ అదరగొట్టేశారు. దీపికా పదుకొణె చూడచక్కగా ఉంది. ఇలాంటి మాస్టర్‌ పీస్‌ను క్రియేట్‌ చేస్తున్న నాగ్‌అశ్విన్‌, వైజయంతి ఫిల్మ్స్‌కు నా అభినందనలు’’ - కోన వెంకట్‌

‘‘అత్యద్భుతమైన గ్లింప్స్‌.. సూపర్‌ విజువల్స్‌.. ఆసక్తికరమైన కాన్సెప్ట్‌.. కల్కి..! ఆల్‌ ది బెస్ట్‌ రెబల్‌స్టార్‌, నాగ్‌ అశ్విన్‌’’ - గోపీచంద్‌ మలినేని


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని