నిహారిక-చైతన్యల డ్యాన్స్‌..రవితేజతో శ్రుతి పోటీ

నిహారిక-చైతన్యల పెళ్లి వేడుకల కోసం కుటుంబ సభ్యులంతా ఉదయ్‌పూర్‌ చేరుకున్నారు. అక్కడ అడుగుపెట్టిన వధూవరులు ఉత్సాహంగా స్టెప్పులేశారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. అదేవిధంగా కల్యాణ్‌ దేవ్‌ తీసిన ఫొటోలంటూ ఉపాసన కొన్ని స్టిల్స్‌ షేర్‌ చేశారు.....

Updated : 08 Dec 2022 13:24 IST

సోషల్‌ లుక్‌: సెలబ్రిటీలు పంచుకున్న విశేషాలు

* నిహారిక-చైతన్యల పెళ్లి వేడుకల కోసం కుటుంబ సభ్యులంతా ఉదయ్‌పూర్‌ చేరుకున్నారు. అక్కడ అడుగుపెట్టిన వధూవరులు ఉత్సాహంగా స్టెప్పులేశారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. అదేవిధంగా కల్యాణ్‌ దేవ్‌ తీసిన ఫొటోలంటూ ఉపాసన కొన్ని స్టిల్స్‌ షేర్‌ చేశారు.

* రవితేజతో పోటీపడ్డ శ్రుతి హాసన్‌ ఓడిపోయారు. ‘క్రాక్‌’ సినిమా సెట్‌లో ఫిట్‌నెస్‌ పరంగా పందెం వేసుకున్నారు. రవితేజ ప్లాంక్‌ వేసినంత సేపు శ్రుతి వేయలేకపోయారు. ఈ వీడియోను ఆమె సోషల్‌ మీడియాలో షేర్‌ చేశారు. చిత్ర బృందం కుటుంబంలా మారిందన్నారు.

* రాశీ ఖన్నా పుట్టినరోజు వేడుకల్ని కుటుంబ సభ్యులు ఎంతో ఘనంగా నిర్వహించారు. తన తల్లిదండ్రులు పార్టీ ఏర్పాటు చేసి, సర్‌ప్రైజ్‌ చేశారంటూ నటి వారికి ధన్యవాదాలు తెలిపారు. కరోనా కారణంగా శ్రేయోభిలాషుల్ని పార్టీకి పిలవలేదంటూ వీడియో పంచుకున్నారు.

* ఆమిర్‌ ఖాన్‌ కుమార్తె ఐరాఖాన్‌ విహారయాత్రలో ఉన్నారు. పనుల్ని పక్కన పెట్టి.. బ్రేక్‌ తీసుకోవాల్సిన సమయం అంటూ పొట్టి దుస్తుల్లో ఉన్న ఫొటోలు షేర్‌ చేశారు. ఇవి కాస్త వైరల్‌గా మారాయి.

* శర్వానంద్‌, సిద్ధార్థ్‌, అదితిరావు హైదరి, అను ఇమ్మాన్యుయెల్‌ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ‘మహా సముద్రం’ సినిమా షూటింగ్‌ ఆరంభమైంది. అజయ్‌ భూపతి ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. సోమవారం పోస్టర్‌ను కూడా విడుదల చేశారు. 

ఇవీ చదవండి..
అమ్మ చీరలో నిహారిక.. జాన్వి డ్యాన్స్‌












Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని