జంతువుల్ని పెడితే, కాల్‌షీట్లు ఎగగొట్టవు

చిన్నప్పదేవర్‌ చిత్ర నిర్మాత, శాండో, సుబ్రమ్మణ్యస్వామి భక్తుడు. కొన్ని చిత్రాలు నటులతో నిర్మించినా, ఎక్కువగా జంతువులతో తీశారు.

Updated : 13 Sep 2022 14:29 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: చిన్నప్పదేవర్‌ చిత్ర నిర్మాత, శాండో, సుబ్రమ్మణ్యస్వామి భక్తుడు. కొన్ని చిత్రాలు నటులతో నిర్మించినా, ఎక్కువగా జంతువులతో తీశారు. ఏనుగులు, పాములు, పులులు, ఆవులు, పొట్టేళ్లు ఇలా. ‘‘జంతువుల్ని మచ్చిక చేసుకుని నటింపజేస్తే ఎంతో యోగ్యం. నా సినిమాలన్నీ ఘన విజయం సాధించినవే. పైగా ఇంకోటుంది. ప్రధాన ప్రాతల్లో జంతువుల్ని పెడితే, కాల్‌షీట్లు ఎగగొట్టవు. ‘అది కావాలి ఇది కావాలి’ అన్ని కోరికలు ఉండవు. చెప్పినట్టు వింటాయి. మనకి కావలసినట్టుగా నటిస్తాయి’’ అని చెప్పేవారు దేవర్‌. ఏనుగుని ప్రధాన పాత్రలో చూపించిన ‘హాథీ మేరీ సాథీ’ విదేశాల్లో కూడా ఘన విజయం సాధించింది.

దేవర్‌ ఆయా జంతువుల్ని పలకరించే విధానం. మాట్లాడే విధానం చిత్రంగా ఉండేది. ఎంతో ప్రేమ చూపించేవారు. ఆవుతో తీసిన ‘గాయ్‌ ఔర్‌ గౌరి’లోని ఆవుని ప్రేమాతిశయంతో చూసుకున్నారు. వాహిని స్టూడియోలో ప్రత్యేకం మంటపంలాంటి పెద్ద గది కట్టించి అందులో ఉంచారు. ఎండా వానా తగిలే ప్రసక్తి లేదు. దోమలు వాలకుండా పైన పెద్ద ఫ్యాను ప్రత్యేకంగా తయారు చేయించి పెట్టారు. ఎప్పటికప్పుడు శుభ్రపరచడానికి ఇద్దరు పనివాళ్లు ఉండేవారు. పొద్దున్నే వచ్చి రోజూ ఆవుని పలకరించి, మెడంతా దువ్వి బుద్ధులు చెప్పి వెళ్లేవారు. ‘‘ఇవాళ నీకు షూటింగు లేదురా కన్నా. హాయిగా విశ్రాంతి తీసుకో’’ అని చెప్పివేళ్లేవారు. ఆయన కంపెనీకి బ్యాంక్‌ ఖాతా లేదు. అంతా నగదే. ఆ నగదు ఇచ్చి రశీదు తీసుకునేవారు. సినిమా కొన్న వాళ్ల దగ్గరా డబ్బులే తీసుకునేవారు. ఏనాడూ, పైన చొక్కా వేసుకోలేదు ఒళ్లంతా చందనం పూసుకునేవారు. అలాగే విమానంలో బొంబాయి వెళ్లి వస్తూ ఉండేవారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని