Chiranjeevi: సుకుమార్‌ దర్శకత్వంలో చిరంజీవి!

ప్రముఖ నటుడు చిరంజీవిని డైరెక్ట్‌ చేసే అవకాశం అందుకున్నారు  దర్శకుడు సుకుమార్‌. ఈ విషయాన్ని సోషల్‌ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు.

Updated : 22 Feb 2022 21:48 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రముఖ నటుడు చిరంజీవిని డైరెక్ట్‌ చేసే అవకాశం అందుకున్నారు దర్శకుడు సుకుమార్‌. ఈ విషయాన్ని ఆయన సోషల్‌ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు. ‘‘మెగాస్టార్‌ను డైరెక్ట్‌ చేయాలనే నా కల నిజమైంది. వివరాలు అతి త్వరలోనే తెలియజేస్తా’’ అంటూ చిరంజీవితో దిగిన ఫొటోని షేర్‌ చేశారు. సుకుమార్‌ అనూహ్య ప్రకటనతో సినీ అభిమానులు సర్‌ప్రైజ్‌ ఫీలవుతున్నారు. ఓ వాణిజ్య ప్రకటన కోసం ఈ ఇద్దరూ కలిసి పనిచేస్తున్నట్టు సమాచారం. ఇదే కాంబినేషన్‌లో ఓ సినిమా కూడా వచ్చే అవకాశం ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది.

ఇటీవల.. ‘పుష్ప’తో మంచి విజయం అందుకున్న సుకుమార్‌ ప్రస్తుతం ఆ సినిమా సీక్వెల్‌ పనుల్లో బిజీగా ఉన్నారు. త్వరలోనే చిత్రీకరణ ప్రారంభంకానుంది. మరోవైపు, యువ నటుడు విజయ్‌ దేవరకొండతో ఓ చిత్రాన్ని ఇప్పటికే ప్రకటించారు. కొరటాల శివ దర్శకత్వంలో చిరంజీవి నటించిన ‘ఆచార్య’ ఏప్రిల్‌ 29న విడుదల కానుంది. మోహన్‌రాజా దర్శకత్వంలో ‘గాడ్‌ ఫాదర్‌’, మెహర్‌ రమేశ్‌ దర్శకత్వంలో ‘భోళాశంకర్‌’ సినిమాలు చేస్తున్నారు. కె. ఎస్‌. రవీంద్ర (బాబీ)తో ఓ చిత్రం ఖరారు చేశారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని