Chiranjeevi: వరుణ్ - లావణ్య.. అద్భుతమైన జోడీ: చిరంజీవి
వరుణ్ తేజ్ (Varun Tej) - లావణ్య త్రిపాఠి (Lavanya Tripathi) జంటకు అభినందనలు తెలిపారు చిరంజీవి (Chiranjeevi). వీరి జోడీ చూడముచ్చటగా ఉందన్నారు.
హైదరాబాద్: వరుణ్ తేజ్ (Varun Tej), లావణ్య త్రిపాఠి (Lavanya Tripathi) అద్భుతమైన జోడీ అని మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) అన్నారు. వీరు నిశ్చితార్థం చేసుకున్న సందర్భంగా కొత్త జంటకు శుభాకాంక్షలు చెబుతూ తాజాగా ఆయన ట్విటర్‌లో ఓ పోస్ట్ పెట్టారు. ‘‘నిశ్చితార్థంతో ఒక్కటైన వరుణ్‌తేజ్ - లావణ్య త్రిపాఠికి నా హృదయపూర్వక అభినందనలు. మీ జంట అద్భుతంగా ఉంది. అందరి ప్రేమాభిమానాలతో మీ జీవితం సంతోషంగా సాగాలని కోరుకుంటున్నా’’ అని చిరంజీవి రాసుకొచ్చారు.
మరోవైపు, నిహారిక.. ‘‘అన్నయ్యా.. ఎంతోకాలం నుంచి ఈ రోజు కోసం ఎదరుచూస్తున్నా. వెల్‌కమ్ టు ది ఫ్యామిలీ వదిన’’ అంటూ పోస్ట్ పెట్టారు. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట వైరల్‌గా మారాయి. అల్లు అర్జున్, సాయిధరమ్ తేజ్, మంచు లక్ష్మి, ప్రగ్యాజైశ్వాల్, కోన వెంకట్ తదితరులు ఈ జంటకు శుభాకాంక్షలు చెప్పారు.
ఇక, శుక్రవారం సాయంత్రం హైదరాబాద్‌లోని నాగబాబు నివాసంలో చిరంజీవి - సురేఖ దంపతుల సమక్షంలో వీరి నిశ్చితార్థం జరిగింది. పవన్‌కల్యాణ్, అల్లు అర్జున్, రామ్‌చరణ్ తేజ్, అల్లు అరవింద్, వైష్ణవ్ తేజ్.. ఇలా కుటుంబసభ్యులు మాత్రమే ఈ వేడుకలో పాల్గొన్నారు. 2016 నుంచి వరుణ్ - లావణ్య ప్రేమలో ఉన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Chandrababu Arrest: చంద్రబాబు బెయిల్ పిటిషన్‌పై వాదనలు ప్రారంభం
-
Siva Karthikeyan: శివ కార్తికేయన్ మూవీ.. మూడేళ్ల తర్వాత మెగాఫోన్ పట్టనున్న దర్శకుడు..!
-
Vivo Y56: వివో వై56లో కొత్త వేరియంట్.. ధర, ఫీచర్లలో మార్పుందా?
-
Canada: అందరూ చూస్తున్నారు.. పోస్టర్లు తొలగించండి..: కెనడా హడావుడి
-
IND w Vs SL w: ఆసియా క్రీడల్లో భారత క్రికెట్ జట్టుకు స్వర్ణం..
-
Indian Air Force: వాయుసేన చేతికి తొలి సీ-295 విమానం..!