‘రంజితమే’ పాట.. డ్యాన్స్‌తో షేక్‌ చేసిన కొరియోగ్రాఫర్‌ జానీ

‘రంజితమే’ (Ranjithame) పాటకు ఎంతోమంది డ్యాన్స్‌లు చేయడం చూశాం. తాజాగా ఇదే పాటకు దీని ఒరిజినల్‌ కొరియోగ్రాఫర్‌ జానీ (Jani) స్టెప్పులు వేసి అలరించారు.

Updated : 22 Jan 2023 12:14 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: విజయ్ ‌(Vijay) హీరోగా నటించిన ఫ్యామిలీ, కమర్షియల్‌ ఎంటర్‌టైనర్‌ ‘వారిసు’ (Vaarisu). రష్మిక (Rashmika) కథానాయిక. వంశీ పైడిపల్లి (Vamshi Paidipally) దర్శకత్వం వహించిన ఈ సినిమాలోని ‘రంజితమే’ (Ranjithame) పాట థియేటర్లను షేక్‌ చేస్తోన్న విషయం తెలిసిందే. విజయ్‌ - రష్మిక జోడీ వేసిన స్టెప్పులను ఫ్యాన్స్‌ ఫుల్‌గా ఎంజాయ్‌ చేస్తున్నారు. మరోవైపు యూట్యూబ్‌లోనూ ఈ పాట 150 మిలియన్లకు పైగా వ్యూస్‌ సొంతం చేసుకుంది.

కాగా, ఈ పాటకు జానీ మాస్టర్‌ (Jani Master) డ్యాన్స్‌ చేసిన ఓ వీడియో ప్రస్తుతం నెట్టింట అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. తన బృందంతో కలిసి స్టేజ్‌ దద్దరిల్లిపోయేలా స్టెప్పులేసి.. అక్కడ ఉన్న వారందర్నీ అలరించారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు.. ‘వావ్‌.. సూపర్‌ మాస్టర్‌’ అనకుండా ఉండలేకపోతున్నారు.

ఈటీవీలో ప్రసారమైన ‘ఢీ’ డ్యాన్స్‌ రియాల్టీ షోతో కొరియోగ్రాఫర్‌గా ఎదిగిన జానీ.. ఎన్టీఆర్‌, అల్లు అర్జున్‌, రామ్‌చరణ్‌ వంటి టాలీవుడ్‌ స్టార్‌ హీరోలు నటించిన చిత్రాల కోసం పనిచేశారు. ఆయన కొరియోగ్రఫీ చేసిన పాటలన్నీ సూపర్‌ హిట్‌ కావడంతో స్టార్‌ కొరియోగ్రాఫర్‌గా పేరు సొంతం చేసుకున్నారు. ఈక్రమంలోనే విజయ్‌ నటించిన గత చిత్రం ‘బీస్ట్’లోని ‘హలమితి హబీబో’కు కొరియోగ్రాఫర్‌గా చేశారు. ఇప్పుడు మళ్లీ ‘రంజితమే’ పాట కోసం విజయ్‌తో వర్క్‌ చేశారు.



Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని