అమెజాన్‌ ప్రైమ్‌లో ‘టెనెట్‌’!

కాలంతో ప్రయోగ చిత్రాలు చేస్తూ హాలీవుడ్‌లో, అంతర్జాతీయంగా తనదైన ముద్ర వేసిన దర్శకుడు క్రిస్టోఫర్‌

Published : 30 Mar 2021 20:37 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: కాలంతో ప్రయోగ చిత్రాలు చేస్తూ హాలీవుడ్‌లో, అంతర్జాతీయంగా తనదైన ముద్ర వేసిన దర్శకుడు క్రిస్టోఫర్‌ నోలన్. ఆయన చిత్రాలకు ప్రత్యేకంగా అభిమానులు ఉంటారనడంలో సందేహం లేదు. ఇందుకు ‘ఇన్‌సెప్షన్‌’, ‘ఇంటర్‌స్టెల్లార్‌’ వంటి ప్రయోగాత్మక చిత్రాలే కారణం. ఇటీవల కాలంలో ఆయన నుంచి వచ్చిన సైన్స్‌ ఫిక్షన్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌ ‘టెనెట్‌’. కరోనా కారణంగా ఆలస్యంగా విడుదలైనా మంచి టాక్‌ను తెచ్చుకుంది. భారత్‌లో డిసెంబరు 4న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇప్పుడు ప్రముఖ ఓటీటీ అమెజాన్‌ ప్రైమ్‌ వేదికగా స్ట్రీమింగ్‌ కానుంది. మార్చి 31వ తేదీ నుంచి ఇంగ్లీష్‌, హిందీ, తెలుగు, తమిళ భాషల్లో అందుబాటులోకి రానుంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని