Pawan Kalyan: రామ్‌లల్లా విగ్రహ ప్రాణప్రతిష్ఠ.. తెలియకుండానే కన్నీళ్లు వచ్చేశాయి: పవన్‌ కల్యాణ్‌

రామ్‌లల్లా విగ్రహ ప్రాణ ప్రతిష్ఠను ఉద్దేశించి పలువురు సినీ తారలు ఆనందం వ్యక్తం చేశారు.

Updated : 22 Jan 2024 18:02 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. రామ్‌లల్లా విగ్రహ ప్రాణప్రతిష్ఠ కార్యక్రమాన్ని వీక్షించేందుకు సినీ, రాజకీయ, పారిశ్రామిక వేత్తలు తరలివచ్చారు. 500 ఏళ్ల నాటి కల సాకారమైందంటూ హర్షం వ్యక్తం చేశారు. కార్యక్రమం అనంతరం పవన్‌కల్యాణ్‌ మీడియాతో మాట్లాడారు. ‘‘ఇది నాకెంతో ఉద్వేగభరితమైన రోజు. ప్రాణప్రతిష్ఠ సమయంలో తెలియకుండానే కన్నీళ్లు వచ్చేశాయి. ఎన్నో ఏళ్ల కల నెరవేరిన క్షణాలివి.  ఇది భారత్‌ను మరింత ఏకం చేస్తుంది. రానున్న రోజుల్లో ఇక్కడికి వచ్చేవారి సంఖ్య పెరుగుతుందని భావిస్తున్నా. అయోధ్య కోసం ఏదైనా చేయాలని ఉంది. భవిష్యత్తులో ఆ దిశగా ప్రయత్నిస్తా’’ అని అన్నారు.

‘‘ఇదొక అత్యద్భుతమైన అనుభవం. దేశ ప్రజలు గర్వపడే రోజు ఇది’’ - చిరంజీవి

‘‘విశ్వాసం, పవిత్రత నడుమ అయోధ్యలోని రామ మందిరాన్ని ప్రతిష్ఠాత్మకంగా ప్రారంభించారు. ఐక్యత, ఆధ్యాత్మికతకు ఇది చిహ్నంగా నిలుస్తుంది. ఇదొక చారిత్రక ఘట్టం. దీనికి సాక్షిగా నిలిచినందుకు గర్వంగా ఉంది’’ - మహేశ్‌బాబు

Jai Hanuman: ‘జై హనుమాన్‌’.. ఆంజనేయుడిగా స్టార్‌ హీరో: ప్రశాంత్‌ వర్మ

‘‘రామ్‌లల్లా ప్రాణ ప్రతిష్ఠ చారిత్రక ఘట్టం. ఈ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించినందుకు ధన్యవాదాలు. సుందరమైన ఈ దేవాలయాన్ని ప్రతి ఒక్కరూ తప్పకుండా సందర్శించాలి’’ - ఆయుష్మాన్‌ ఖురానా

‘‘శ్రీరాముడి ఆశీస్సులు తీసుకునేందుకు వచ్చాను. అద్భుతమైన అనుభూతి కలిగింది. జీవితంలో ఒకసారి మాత్రమే ఇలాంటి అవకాశం వస్తుంది. దేశ ప్రజలు గర్వపడాల్సిన క్షణాలివి’’ - రామ్‌చరణ్‌

‘‘శ్రీరాముడు నన్ను భావోద్వేగానికి గురి చేశారు. ఆయన స్వరూపం ముగ్ధమనోహరంగా ఉంది. రామ్‌లల్లాను చూస్తే స్వామివారే స్వయంగా ఇక్కడ కొలువుదీరినట్లు ఉంది. దేశ ప్రజలందరూ బాగుండాలని కోరుకున్నా’’  - వివేక్‌ ఒబెరాయ్‌




Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని