TSnews: థియేటర్ల పునఃప్రారంభానికి నిరాకరణ

ఓటీటీలు, సినిమా థియేటర్ల మధ్య వ్యవహారం చిలికిచిలికి గాలివానలా మారేలా కనిపిస్తోంది. ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం 100శాతం జనసామర్థ్యంలో థియేటర్ల పునఃప్రారంభానికి అనుమతి ఇచ్చింది. కాగా.. రాష్ట్రంలో సినిమా థియేటర్ల పునఃప్రారంభానికి ఎగ్జిబిటర్లు నిరాకరిస్తున్నారు. హైదరాబాద్‌లో నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లతో పాటు ఇతర సినిమా ప్రముఖులతో

Updated : 07 Jul 2021 16:41 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఓటీటీలు, సినిమా థియేటర్ల మధ్య వ్యవహారం చిలికిచిలికి గాలివానలా మారేలా కనిపిస్తోంది. ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం 100శాతం సామర్థ్యంతో థియేటర్ల పునఃప్రారంభానికి అనుమతి ఇచ్చింది. కాగా.. రాష్ట్రంలో సినిమా థియేటర్లు తెరిచేందుకు ఎగ్జిబిటర్లు నిరాకరిస్తున్నారు. హైదరాబాద్‌లో నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లతో పాటు ఇతర సినిమా ప్రముఖులతో కలిసి బుధవారం సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎగ్జిబిటర్లు మాట్లాడుతూ.. ఓటీటీ నుంచి సినిమా థియేటర్లను బతికించాలని విజ్ఞప్తి చేశారు. ఓటీటీలో సినిమా విడుదల ఆపే వరకూ హాళ్లు తెరవబోమని స్పష్టం చేశారు. ఎగ్జిబిటర్లు తీసుకున్న ఈ నిర్ణయంతో తెలుగు సినిమా నిర్మాతలు సందిగ్ధంలో పడ్డారు. ఓటీటీ వేదికగా తమ సినిమాలను విడుదల చేసేందుకు సన్నాహాలు చేసుకుంటున్న నిర్మాతలు ఈ ఏడాది అక్టోబరు వరకూ వేచి చూడాలని ఇటీవల జరిగిన ఓ సమవేశంలో తెలంగాణ ఫిల్మ్‌ ఛాంబర్‌ ఆఫ్ కామర్స్‌ కోరింది. అప్పటికీ థియేటర్లు తెరవకపోతే ఓటీటీలో సినిమాలు విడుదల చేసుకోవాలని చెప్పింది. నిర్మాతల మండలి నిర్ణయాన్ని కాదని ఓటీటీలో సినిమాలను విడుదల చేస్తే తమ భవిష్యత్ కార్యాచరణను త్వరలోనే వెల్లడిస్తామని హెచ్చరించింది. ఈ క్రమంలోనే తాజాగా సర్వసభ్య సమావేశం ఏర్పాటైంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని