Vijay: ‘లియో’.. మేకర్స్‌ను చిక్కుల్లోకి నెట్టిన ‘నా రెడీ’ సాంగ్‌

‘లియో’ (Leo) సినిమా నుంచి ఇటీవల విడుదలైన ‘నా రెడీ’ (Naa Ready) పాట అంతటా విశేష ఆదరణ అందుకుంటోంది. ఈ పాట విషయమై తాజాగా ఓ సామాజిక కార్యకర్త కోర్టును ఆశ్రయించాడు.

Published : 26 Jun 2023 13:31 IST

చెన్నై: కోలీవుడ్‌ స్టార్‌ హీరో విజయ్‌ (Vijay), డైరెక్టర్‌ లోకేశ్‌ కనగరాజ్‌ (Lokesh Kanagaraj) కాంబినేషన్‌లో రానున్న సరికొత్త చిత్రం ‘లియో’ (Leo). మాస్‌, యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా సిద్ధమవుతోన్న ఈ సినిమా నుంచి ఇటీవల విడుదలైన ‘నా రెడీ’ (Naa Ready Song) సాంగ్‌ ప్రస్తుతం యూట్యూబ్‌ను షేక్‌ చేస్తోన్న విషయం తెలిసిందే. ఇదిలా ఉండగా, ఇప్పుడిదే పాట చిత్రబృందాన్ని చిక్కుల్లోకి నెట్టింది. ఈ పాటలో మత్తు పదార్థాల వాడకం, రౌడీయిజాన్ని ఎక్కువగా చూపించారంటూ చెన్నైలోని Korukkuppettai ప్రాంతానికి చెందిన సామాజిక కార్యకర్త ఆర్‌టీఐ.సెల్వం కోర్టును ఆశ్రయించాడు. ఈ మేరకు విజయ్‌, ఇతర చిత్రబృందంపై ఆన్‌లైన్‌లో ఫిర్యాదు చేశాడు. నార్కోటిక్‌ కంట్రోల్‌ యాక్ట్‌ కింద వారిపై చర్యలు తీసుకోవాలని కోరాడు.

‘మాస్టర్‌’ తర్వాత విజయ్‌ - లోకేశ్‌ కనగరాజ్‌ కాంబినేషన్‌లో వస్తోన్న చిత్రమిది. దీంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇటీవల కశ్మీర్‌లో భారీ షెడ్యూల్‌ పూర్తి చేసుకుంది. గత కొన్నిరోజుల నుంచి చెన్నైలో ఈ సినిమా షూట్‌ జరుగుతోంది. అక్టోబర్‌లో ‘లియో’ను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి చిత్రబృందం సన్నాహాలు చేస్తోంది. ఇక, ఈ సినిమాలో విజయ్‌కు జోడీగా త్రిష నటిస్తోంది. సంజయ్‌ దత్‌, ప్రియా ఆనంద్‌, మిస్కిన్‌, గౌతమ్ వాసుదేవ మేనన్‌ వంటి నటీనటులు కీలకపాత్రల్లో కనిపించనున్నారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని