Dhee 14: నందితకు ప్రదీప్‌ సర్‌ప్రైజ్‌.. గిఫ్ట్‌ చూసి ఏడ్చేసిన నటి

‘ఎక్కడికి పోతావు చిన్నవాడా’, ‘అక్షర’ వంటి చిత్రాలతో తెలుగువారికి చేరువైన ముద్దుగుమ్మ నందితాశ్వేత. వెండితెరపై నటిగా మెప్పించిన ఆమె ప్రస్తుతం ఈటీవీలో....

Published : 22 Apr 2022 15:41 IST

హైదరాబాద్‌: ‘ఎక్కడికి పోతావు చిన్నవాడా’, ‘అక్షర’ వంటి చిత్రాలతో తెలుగువారికి చేరువైన ముద్దుగుమ్మ నందితా శ్వేత. వెండితెరపై నటిగా మెప్పించిన ఆమె ప్రస్తుతం ఈటీవీలో ప్రసారమయ్యే ‘ఢీ-14’ డ్యాన్స్‌ రియాల్టీ షోకి ప్రియమణి, గణేశ్‌ మాస్టర్లతో కలిసి న్యాయనిర్ణేతగా వ్యవహరిస్తున్నారు. ఈ షోకు సంబంధించిన సరికొత్త ప్రోమో తాజాగా బయటకు వచ్చింది. ఇందులో జూనియర్స్‌ గ్రూప్‌కు చెందిన నిక్కి తన డ్యాన్స్‌తో అందర్నీ ఆకట్టుకుంది. ఆమె చేసిన డ్యాన్స్‌కి  న్యాయనిర్ణేతలు, టీమ్‌ లీడర్లు.. ఇలా ప్రతి ఒక్కరూ వావ్‌ అన్నారు. ఇక, ఏప్రిల్‌ 30న నందితా శ్వేత పుట్టినరోజుని పురస్కరించుకున్న ‘ఢీ’ స్టేజ్‌పై ముందస్తు బర్త్‌డే వేడుకలు నిర్వహించారు. ఇందులో భాగంగా నందితకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపిన ప్రదీప్‌.. ‘ఢీ’ టీమ్‌ నుంచి ఓ స్పెషల్‌ సర్‌ప్రైజ్‌ అంటూ ఓ గిఫ్ట్‌ని అందించారు. ఆ గిఫ్ట్‌ తెరచి చూసిన ఆమె స్టేజ్‌పైనే ఏడ్చేశారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని