Dilraju: ‘రాజా.. వెయిట్ చెయ్‌ రాజా’: దిల్‌రాజు సరదా వ్యాఖ్యలు

రజనీకాంత్‌ (Rajinikanth) - నెల్సన్‌ దిలీప్‌కుమార్‌ (Nelson Dileep Kumar) కాంబినేషన్‌లో తెరకెక్కిన చిత్రం ‘జైలర్‌’ (Jailer). గురువారం ఇది ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రాన్ని ఏషియన్‌ ఫిల్మ్స్‌, శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్‌, సురేశ్‌ ప్రొడెక్షన్స్‌ సంయుక్తంగా డిస్ట్రిబ్యూట్‌ చేశాయి.

Published : 10 Aug 2023 18:33 IST

హైదరాబాద్‌: రజనీకాంత్‌ (Rajinikanth) ‘జైలర్‌’ (Jailer) విజయం సెలబ్రేషన్స్‌ హైదరాబాద్‌లో జరిగాయి. ఇందులో పాల్గొన్న నిర్మాత దిల్‌రాజు (Dil Raju) సరదా వ్యాఖ్యలు చేశారు. రజనీతో సినిమాని ఉద్దేశిస్తూ.. ‘వెయిట్‌ రాజా..!’ అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు అంతటా వైరల్‌గా మారాయి. 

‘‘తెలుగు రాష్ట్రాల్లో ఏషియన్‌ సంస్థతో కలిసి మేము ఈ చిత్రాన్ని డిస్ట్రిబ్యూట్‌ చేశాం. ఇందుకు ఎంతో సంతోషంగా ఉంది. ఇప్పుడు అంతటా ఒకటే మాట వినిపిస్తుంది. రజనీ సర్‌ కెరీర్‌లో మరో బ్లాక్‌బస్టర్‌ పడిందని అందరూ చెబుతున్నారు. ప్రేక్షకుల నుంచి వస్తోన్న స్పందన దృష్టిలో ఉంచుకుని మరిన్ని థియేటర్లను యాడ్‌ చేస్తున్నాం. ప్రపంచ వ్యాప్తంగా హిట్‌ టాక్‌ వినిపిస్తోంది. తెలుగులో ఈ చిత్రాన్ని డిస్ట్రిబ్యూట్‌ చేసే అవకాశాన్ని మాకు ఇచ్చిన సన్‌ పిక్చర్స్‌కు ధన్యవాదాలు’’ అని దిల్‌రాజు అన్నారు. ఇదే కార్యక్రమంలో పాల్గొన్న ఏషియన్‌ సునీల్‌ సైతం సినిమా విజయం పట్ల ఆనందం వ్యక్తం చేశారు.

Renu Desai: పవన్‌కల్యాణ్‌కే నా మద్దతు.. ఆయన డబ్బు మనిషి కాదు: రేణూ దేశాయ్‌

మీరిద్దరూ కలిసి గతంలో ఏదైనా చిత్రాన్ని డిస్ట్రిబ్యూట్‌ చేశారా?

దిల్‌రాజు: గతంలో రెండు సినిమాలు డిస్ట్రిబ్యూట్‌ చేశాం. కాకపోతే అవి పెద్దగా ఆడలేదు. ఈ సినిమా హిట్‌ అయ్యింది. అందుకే ఇలా కలిసి మీడియా ముందుకు వచ్చాం.

‘భోళా శంకర్‌’ థియేటర్ల గురించి చెప్పగలరు?

దిల్‌రాజు:  ‘భోళాశంకర్‌’కు ఇప్పటికే భారీ సంఖ్యలో థియేటర్‌లు లాక్‌ అయ్యాయి. ‘జైలర్‌’కు వచ్చిన రెస్పాన్స్‌ను దృష్టిలో ఉంచుకుని ఇప్పుడు ఈ చిత్రానికి మరిన్ని థియేటర్లు యాడ్‌ చేశాం. ఆగస్టు 15 తర్వాత ఏ సినిమాకు విశేష స్పందన ఉంటే దానికి ఎక్కువ థియేటర్లు ఇస్తాం.

‘జైలర్‌’ ఆడియో ఫంక్షన్‌లో రజనీ కొన్ని కామెంట్స్‌ చేశారు. దానిపై మీ అభిప్రాయం?

దిల్‌రాజు: నేను చూడలేదు.

రజనీకాంత్‌తో ఏదైనా ఈవెంట్స్‌ ప్లాన్‌ చేస్తున్నారా?

దిల్‌రాజు: ప్రమోషన్స్‌ గురించి గతవారమే రజనీ సర్‌ను అడిగా. దానికి ఆయన.. ‘ ప్రమోషన్‌ చేయాలనుకుంటే అన్ని ప్రాంతాలకు వెళ్లాలి. ఒక ప్రాంతానికి వెళ్లి, మరొక ప్రాంతానికి వెళ్లకపోవడం నాకు ఇష్టం లేదు’ అని చెప్పారు. ఆయన ఇప్పుడు హిమాలయాలకు వెళ్లారు.

ఏపీ ప్రభుత్వం నుంచి ఇండస్ట్రీపై ఎన్నో విమర్శలు వస్తున్నాయి కదా. దానిపై ఏం చెప్పాలనుకుంటున్నారు?

దిల్‌రాజు: మనం ‘జైలర్‌’ గురించి మాట్లాడితే బాగుంటుంది. వేరే టాపిక్స్‌ ఎందుకు చెప్పండి. పాజిటివ్‌గా ఉందాం. పక్క విషయాలు మనకు ఎందుకు. విషయం ఏదైనా సరే.. ఒక ఉద్దేశంలో మాట్లాడితే అది ఎదుటి వాళ్లకు వేరే ఉద్దేశంలో అర్థమవుతుంది. మీడియాలోకి వచ్చేసరికి అది మరొక విధంగా ప్రజలకు చేరుతుంది.

విజయ్‌తో ‘వారసుడు’ తీశారు. మరి, రజనీతో ఎప్పుడు సినిమా చేస్తారు?

దిల్‌రాజు: ‘రాజా.. వెయిట్ చెయ్‌ రాజా..!’ అంటూ ఆయన నవ్వులు పూయించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని