Dulquer Salmaan: ఆ సినిమా నా జీవితంలో గేమ్‌ ఛేంజర్‌: దుల్కర్‌

మలయాళ సూపర్‌ స్టార్‌ మమ్ముట్టి కొడుకుగా ఇండస్ట్రీకి వచ్చాడు దుల్కర్ సల్మాన్‌. ఓకే బంగారం, మహానటి, కనులు కనులను దోచాయంటే సినిమాలతో తెలుగులోనూ గుర్తింపు తెచ్చుకున్నారు. ఈ యంగ్‌ హీరో తాజాగా తను నటించిన ‘కురుప్‌’ సినిమా గురించి మాట్లాడారు. 

Published : 13 Nov 2022 12:36 IST

హైదరాబాద్‌: మహానటి సినిమాతో తెలుగులోనూ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు దుల్కర్‌ సల్మాన్‌(Dulquer Salmaan). తాజాగా ఈ టాలెంటెడ్‌ హీరో తాను నటించిన కురుప్‌(Kurup) సినిమా గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆయన సొంత నిర్మాణ సంస్థ వే ఫారర్ ఫిల్మ్స్‌(Wayfarer Films)తో పాటు ఎం-స్టార్ ఎంటర్‌టైన్‌మెంట్స్‌తో కలిసి నిర్మించిన ఈ చిత్రం విడుదలై సంవత్సరం అయింది. ఈ సందర్భంగా ఆ సినిమాలోని ఫొటోలను పంచుకున్న దుల్కర్‌ ఇన్‌స్టా వేదికగా ఓ లేఖ రాశారు.

‘‘కురుప్‌.. ఈ సినిమా మా జీవితంలోనే పెద్ద గేమ్‌ ఛేంజర్‌.  మా మీద మాకు నమ్మకాన్ని పెంచి.. మా కలలను సాకారం చేసుకోడానికి ప్రోత్సాహాన్ని ఇచ్చింది. మా సంస్థ ఏదైనా సాధించగలదని నేను నమ్ముతున్నాను. మీకు ఎప్పటికీ గుర్తుండిపోయే అద్భుతమైన చిత్రాలను అందిస్తాం. ఈ చిత్రం కోసం ఎంతోమంది కష్టపడి పనిచేశారు. వాళ్లందరికి, మా భాగస్వాములందరికీ కృతజ్ఞతలు. అన్నింటి కంటే ముఖ్యంగా ఈ సినిమాను ఆదరించిన ప్రేక్షకులకు ధన్యవాదాలు’’ అని చెప్పారు.

దుల్కర్‌ సల్మాన్‌ హీరోగా నటించిన కురుప్‌ సినిమా గతేడాది నవంబర్‌లో పాన్‌ ఇండియా స్థాయిలో విడుదలైంది. నేర నేపథ్యంలో సాగే కథగా తెరముందుకు వచ్చిన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని