Kantara: ‘కాంతార’.. ఆ స్టార్ హీరోతో చేయాలనుకున్నా: రిషబ్ శెట్టి
రీసెంట్ బ్లాక్‌బస్టర్ ‘కాంతార’కు సంబంధించిన ఓ ఆసక్తికర విషయాన్ని బయటపెట్టారు నటుడు రిషబ్ శెట్టి. ఆయన స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని మొదట ఓ స్టార్ హీరోతో చేయాలనుకున్నారట.
ఇంటర్నెట్‌డెస్క్: ‘కాంతార’(Kantara)తో ఒక్కసారిగా దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నారు కన్నడ నటుడు రిషబ్ శెట్టి (Rishab Shetty). కెరీర్ ఆరంభంలో ‘హీరో’, ‘బెల్ బాటమ్’ చిత్రాలతో నటుడిగా కన్నడ పరిశ్రమలో గుర్తింపు తెచ్చుకున్న ఆయన ‘కాంతార’తో బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్‌ని తన ఖాతాలో వేసుకున్నారు. అయితే, ఈ చిత్రాన్ని తొలుత కన్నడ అగ్ర కథానాయకుడు, దివంగత నటుడు పునీత్ రాజ్‌కుమార్‌తో (Puneeth Rajkumar) చేయాలనుకున్నారట రిషబ్. ఇదే విషయాన్ని తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఆయన చెప్పారు.
‘‘కాంతార’ను పునీత్ రాజ్‌కుమార్‌తో చేయాలనుకున్నా. ఓసారి ఆయన్ని కలిసి కథ కూడా చెప్పా. ఆయనకు బాగా నచ్చింది. తప్పకుండా సినిమా చేయాలనుకున్నారు. కాకపోతే, ఆ సమయంలో ఆయన వరుస సినిమాల్లో నటిస్తున్నారు. దానివల్ల డేట్స్ సర్దుబాటు కాలేదు. ఓసారి నాకు ఫోన్ చేసి.. ‘‘కాంతార’ కథ చాలా బాగుంది. అందులో నటించడానికి వీలు పడటం లేదు. ఒకవేళ నువ్వు వెయిట్ చేసినా.. ఈ ఏడాది వీలుకాకపోవచ్చు. కాబట్టి, నువ్వే ఈ సినిమాలో నటించు’’ అని చెప్పారని రిషబ్ వివరించారు. రూ.16 కోట్లతో నిర్మించిన ఈ సినిమా ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా రూ.350 కోట్లు వసూళ్లు రాబట్టింది. కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ బుధవారం ఈ చిత్రాన్ని వీక్షించారు. తుళునాడు సంస్కృతి, సాంప్రదాయాలను గొప్పగా ఆవిష్కరించారంటూ చిత్రబృందాన్ని ఆమె మెచ్చుకున్నారు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Ap-top-news News
శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటలు
-
World News
Pizza: ఇప్పుడు తినండి.. మరణానంతరం చెల్లించండి.. ఓ పిజ్జా కంపెనీ వింత ఆఫర్!
-
India News
Stalin: బుల్లెట్ రైలులో సీఎం స్టాలిన్.. రెండున్నర గంటల్లో 500కి.మీల ప్రయాణం!
-
World News
Graduation Day: విద్యార్థులకు బిలియనీర్ సర్ప్రైజ్ గిఫ్ట్.. కారణమిదే!
-
Movies News
The Kerala Story: వాళ్ల కామెంట్స్‌కు కారణమదే.. కమల్‌హాసన్ వ్యాఖ్యలపై దర్శకుడు రియాక్షన్
-
India News
Siddaramaiah: కొత్త మంత్రులకు టార్గెట్స్ ఫిక్స్ చేసిన సీఎం సిద్ధరామయ్య!