
SarkaaruVaari Paata: ప్రేమికుల రోజున...
విడుదలకి కొన్ని నెలల ముందు నుంచే సినిమాల పాటలు సందడి చేయడం ఇటీవల ఓ ట్రెండ్‌గా మారింది. పాటలు ఎంత బలంగా ప్రేక్షకుల్లోకి వెళితే..సినిమాపై అంతగా ఆసక్తి ఏర్పడుతుందని చిత్రవర్గాలు నమ్ముతున్నాయి. అందుకే నెలల ముందే హంగామా మొదలవుతోంది. ‘సర్కారు వారి పాట’ సందడి కూడా షురూ కానుంది. మహేష్‌బాబు కథానాయకుడిగా పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రమిది. కీర్తిసురేష్ కథానాయిక. నవీన్ యెర్నేని, వై.రవిశంకర్, రామ్ ఆచంట, గోపీ ఆచంట నిర్మాతలు. ఈ సినిమాలోని తొలి పాటని ప్రేమికుల రోజున విడుదల చేయనున్నారు. ఆ విషయాన్ని త్వరలోనే ప్రకటించనుంది చిత్రబృందం. ఈ సినిమాకి తమన్ స్వరాలు సమకూర్చుతున్న సంగతి తెలిసిందే.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.