Flora Saini: తన జీవితంలో జరిగిన చేదు జ్ఞాపకాన్ని గుర్తుచేసుకున్న నటి...

గతంలో గృహహింసకు గురైన రోజులను గుర్తు తెచ్చుకుంది హీరోయిన్‌ ఫ్లోరా షైనీ(Flora Saini). తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తన జీవితంలో ఎదురైన చేదు జ్ఞాపకం గురించి చెప్పింది. 

Published : 07 Dec 2022 16:31 IST

హైదరాబాద్‌: తెలుగులో నరసింహనాయుడు, నువ్వునాకునచ్చావ్‌ లాంటి పలు సినిమాల్లో కనిపించి అలరించిన నటి ఫ్లోరా షైనీ(Flora Saini). తాజాగా తన జీవితంలో జరిగిన కొన్ని చేదు జ్ఞాపకాలను గుర్తుచేసుకున్నారు. ఇటీవల సంచలనం సృష్టించిన శ్రద్ధా వాకర్‌ హత్య కేసు గురించి మాట్లాడుతూ తాను కూడా  అలాంటి పరిస్థితినే ఎదుర్కొన్నట్లు చెప్పింది. కొన్ని సంవత్సరాల క్రితం తన మాజీ ప్రియుడు చిత్ర హింసలకు గురి చేసినట్లు పేర్కొంది.

‘అతను ప్రారంభంలో చాలా మంచిగా మాట్లాడేవాడు. మా అమ్మనాన్నలు కూడా అతను మంచి వాడనుకున్నారు. కానీ తన కోసం నేను నా కుటుంబాన్ని వదిలేసేలా చేశాడు. సడెన్‌గా ఒకరోజు నాపై చేయి చేసుకున్నాడు. తన దగ్గర ఉన్న వాళ్ల నాన్న ఫొటో తీసి ‘మా నాన్న మీద ప్రమాణం చేసి చెబుతున్నా.. నిన్ను ఈ రోజు చంపేస్తాను’ అని హెచ్చరించాడు. ఆరోజు తను కొట్టిన దెబ్బలకు నా దవడ పగిలిపోయిందేమో, చనిపోతానేమో అని భయం వేసింది. ఆ సమయంలో మా అమ్మ చెప్పిన మాటలు గుర్తుకు వచ్చాయి. అంతే నా ఒంటిమీద దుస్తులు ఉన్నాయో లేదో కూడా చూసుకోకుండా మా ఇంటికి పరిగెత్తా. మళ్లీ ఎప్పుడూ తన దగ్గరకు రాలేదు’ అని చెప్పింది ఫ్లోరా షైనీ. 

Read latest Movies News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు