రాజనాలను చూసి మహిళలు పరుగో పరుగు

విలన్‌ పాత్రలతో వెండితెరపై తనదైన ముద్ర వేసిన నటుడు రాజనాల. ప్రతినాయక పాత్రల్లో ఆయన చూపించిన క్రూరత్వం ప్రేక్షకుల మదిపై చెరగని ముద్ర వేసింది. అది ఎంతలా అంటే..

Updated : 21 Sep 2020 12:47 IST

విలన్‌ పాత్రలతో వెండితెరపై తనదైన ముద్ర వేసిన నటుడు రాజనాల. ప్రతినాయక పాత్రల్లో ఆయన చూపించిన క్రూరత్వం ప్రేక్షకుల మదిపై చెరగని ముద్ర వేసింది. అది ఎంతలా అంటే.. తెరపై ఆయనది నటన అయినా, బయట కూడా ఆయన నిజంగా అలాగే  ఉంటారేమో అన్నంత భయం.

‘వరకట్నం’ (1968) చిత్ర షూటింగ్‌ తాడేపల్లిగూడెం ప్రాంతంలో జరిగింది. అక్కడ షాట్‌ గ్యాప్‌ వచ్చినప్పుడల్లా చిత్ర ప్రధాన తారాగణమంతా రోడ్డు పక్కన ఉన్న చెట్టు నీడలో సేద తీరుతుండే వారు. ఆ సమయంలో అక్కడకొచ్చిన అభిమానులు తారల చుట్టూ చేరుతుండేవారు. ఓరోజు చిత్ర కథానాయిక కృష్ణకుమారి అక్కడ చెట్టు కింద కూర్చోని ఉండగా.. ఆమెతో మాట్లాడేందుకు కొద్దిమంది స్థానిక గ్రామాల నుంచి మహిళలు వచ్చారు. అంతలో రాజనాల తన షాట్‌ పూర్తి కాగానే అటు వైపుగా వచ్చారు. దీంతో అక్కడున్న స్త్రీలంతా ఆయన్ను చూసి ‘అమ్మో రాజనాల!’ అంటూ దూరంగా పరిగెత్తారట. తర్వాత కృష్ణకుమారి, రాజనాల ఆ మహిళల అమాయకత్వం చూసి తెగ నవ్వుకున్నారట.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని