
వావ్.. విక్రమ్ లుక్ అదిరిపోయింది!
హైదరాబాద్: సినిమా కోసం, అందులోని పాత్ర కోసం ఏమైనా చేసేందుకు, ఎంతలా అయినా మారేందుకు సిద్ధంగా ఉంటారు కొందరు నటులు. ఒక కమల్‌హాసన్, అమితాబ్‌బచ్చన్, మోహన్‌లాల్ ఇలా చెప్పుకొంటూ పోతే, ఆ జాబితాలో ప్రత్యేకంగా కనిపించే నటుడు విక్రమ్. వైవిధ్యమైన పాత్రల్లో విభిన్న గెటప్‌ల్లో కనిపించడం ఆయనకే సొంతం. జయాపజయాలతో సంబంధం లేకుండా కష్టపడతారు. విక్రమ్ కథానాయకుడు అజయ్ జ్ఞానముత్తు దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘కోబ్రా’. శుక్రవారం ఈ చిత్ర ఫస్ట్‌లుక్‌ను విడుదల చేశారు.
ఇందులో ఏడు విభిన్న గెటప్‌లలో విక్రమ్ కనిపించి కను విందు చేశారు. వివిధ గెటప్‌లలో కనిపించడం విక్రమ్‌కు కొత్తేమీ కాదు. కానీ, గతంలో ఎన్నడూ కనిపించని గెటప్‌లలో ‘కోబ్రా’లో కనిపిస్తున్నారు. శరవేగంగా చిత్రీకరణ జరుపుకొంటున్న ఈ సినిమా వేసవి కానుకగా మేలో విడుదల కానుంది. ఏఆర్ రెహమాన్ ఈ చిత్రానికి సంగీతం సమకూర్చడం విశేషం. ‘కోబ్రా’ఫస్ట్‌లుక్‌కు అటు కోలీవుడ్‌తో పాటు ఇటు టాలీవుడ్ ప్రేక్షకులకు ఫిదా అవుతున్నారు. సినిమా కోసం ఆయన పడే కష్టానికి హ్యాట్సాఫ్ చెబుతున్నారు.