అంజలిగా మారిన ఎస్వీఆర్‌

‘మాయా బజార్‌’లో ఘటోత్కచుడు మాయ శశిరేఖ రూపంలో నానా అల్లరీ చేయడం కథలో భాగం.

Published : 27 Jan 2024 14:48 IST

‘మాయా బజార్‌’లో ఘటోత్కచుడు మాయ శశిరేఖ రూపంలో నానా అల్లరీ చేయడం కథలో భాగం. అలా స్త్రీ, పురుష పాత్రలు పరస్పరం మారిన సందర్భాలు చాలా సినిమాల్లో ఉన్నాయి. కానీ పురుష పాత్ర ప్రధానంగా రాసుకున్న కథతో కొంతమేర చిత్రీకరణ పూర్తి  చేసిన తర్వాత అది స్త్రీ పాత్రగా మారిన ఓ సందర్భం ఇది. కథలో ప్రధాన పాత్ర రామభక్తుడు. అనాథలైన ఓ తల్లికీ, ఆమె కుమార్తెకూ తన ఇంట ఆశ్రయం ఇస్తాడు.   ఇరవయ్యేళ్ల పాటు కంటికి రెప్పలా కాపాడతాడు. చివరకు ఆ అమ్మాయికి పెళ్లి చేసే సమయానికి ఆ తల్లీ, కూతుళ్లు తన కుమారుడిని హత్య చేసిన దుర్మార్గుడి భార్యాబిడ్డలని తెలుస్తుంది. తీవ్రమైన ఘర్షణ నేపథ్యంలో ఆ రామభక్తుడు నిండు   మనసుతో వారిని క్షమించి ఎప్పటిలాగే ఆదరిస్తాడు. ఇదీ ఇతివృత్తం. ఎస్వీ రంగారావు ప్రధాన పాత్రలో మొదటి షెడ్యూల్‌ పూర్తి అయింది. రెండో షెడ్యూల్‌ నాటికి ఎస్వీఆర్‌ మరణించడంతో చిత్రం ఆగిపోయే పరిస్థితి ఏర్పడింది. అప్పుడు దుక్కిపాటి మధుసూదనరావు, రచయిత గొల్లపూడి మారుతీరావు కలిసి చర్చించుకుని ఎస్వీఆర్‌ పాత్రను మహిళా పాత్రగా మార్చి అంజలీ  దేవితో ఆ చిత్రాన్ని పూర్తి చేశారు. అదే 1975లో విడుదలైన లలితా మూవీస్‌ వారి ‘చల్లని తల్లి’ చిత్రం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని