సంక్రాంతి సినిమాలతో ‘కోడిపందాలు’

సంక్రాంతి పండుగ అనగానే గుర్తుకువచ్చేది కోడి పందెలు. ప్రతి సంవత్సరం సంక్రాంతి పండుగ ప్రారంభంకాగానే గ్రామాల్లో కోడిపందెలు కూడా సందడిగా హుషారుగా జరుగుతుంటాయి. అయితే ఈ ఏడాది మాత్రం బాక్సాఫీస్‌ వద్ద జరగనున్న కోడిపందెల్లో అగ్రహీరోల చిత్రాలు పోటీపడుతోన్న విషయం.

Published : 09 Jan 2020 15:13 IST

బరిలో ఉండడం కంటే బయట ఉండడం బెటర్‌: నాగశౌర్య

హైదరాబాద్‌: సంక్రాంతి పండుగ అనగానే గుర్తుకువచ్చేది కోడి పందాలు. ప్రతి సంవత్సరం సంక్రాంతి పండుగ ప్రారంభంకాగానే గ్రామాల్లో కోడిపందాలు కూడా సందడిగా హుషారుగా జరుగుతుంటాయి. అయితే ఈ ఏడాది మాత్రం బాక్సాఫీస్‌ వద్ద జరగనున్న కోడిపందాల్లో అగ్రహీరోల చిత్రాలు పోటీపడుతోన్న విషయం తెలిసిందే. దీంతో బాక్సాఫీస్‌ వద్ద నిలిచేదెవరో? గెలిచేదెవరో అని ఆయా హీరోల అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తోన్నారు. ఈ నేపథ్యంలో టాలీవుడ్‌ యువకథానాయకుడు నాగశౌర్య మాత్రం ‘కొన్ని కొన్నిసార్లు బరిలో ఉండడం కంటే బయటే ఉండడం బెటర్‌’ అని అంటున్నారు.

ఆయన కథానాయకుడిగా నటించిన చిత్రం ‘అశ్వత్థామ’. రమణ తేజ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో నాగశౌర్యకు జంటగా మెహరీన్‌ నటించనున్నారు. ఈ సినిమాకు నాగశౌర్యనే కథ అందించారు. జనవరి 31న ఈ సినిమా విడుదల కానుంది. ఈవిషయాన్ని తెలియచేస్తూ ‘అశ్వత్థామ సంక్రాంతి కోడిపందాలు’ అనే పేరుతో ఓ స్పెషల్‌ వీడియోను నాగశౌర్య అభిమానులతో పంచుకున్నారు. 

 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని