కరోనా వైరస్‌ నివారణకు విజయ్‌ దేవరకొండ టిప్స్‌

ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా వైరస్‌పై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక వీడియోను విడుదల చేసింది. టాలీవుడ్ కథానాయకుడు విజయ్ దేవరకొండ ఆ వీడియోలో వైరస్ పట్ల ఎలా జాగ్రత్తగా ఉండాలో ప్రజలకు వివరించారు. షేక్ హ్యాండ్లు వద్దని, పద్ధతిగా.....

Updated : 27 Dec 2022 17:47 IST

హైదరాబాద్‌: ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా వైరస్‌పై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక వీడియోను విడుదల చేసింది. టాలీవుడ్ కథానాయకుడు విజయ్ దేవరకొండ ఆ వీడియోలో వైరస్ పట్ల ఎలా జాగ్రత్తగా ఉండాలో ప్రజలకు వివరించారు. షేక్ హ్యాండ్లు వద్దని, పద్ధతిగా నమస్కారం పెట్టాలని సూచించారు. ఎవరైనా దగ్గుతూ, తుమ్ముతూ ఉంటే వారికి కనీసం 3 అడుగుల దూరంలో ఉండాలని విజయ్ తెలిపారు. అంతేకాకుండా వ్యాధి లక్షణాలుంటే వెంటనే 104 నెంబర్‌కు ఫోన్ చేసి చెప్పాలని విజ్ఞప్తి చేశారు. అలాగే కరోనా వైరస్ ప్రభావిత చైనా సహా ఇతర దేశాల నుంచి ఎవరైనా వస్తే, తప్పనిసరిగా వైద్య పరీక్షలు నిర్వహించుకొని తగు జాగ్రత్తలు తీసుకోవాలని విజయ్ దేవరకొండ కోరారు. రద్దీగా ఉన్న ప్రాంతాలకు దూరంగా ఉండమని, తరచూ సబ్బుతో చేతులు కడగాలని సూచించారు. కరోనా వైరస్‌ గురించి భయపడాల్సిన అవసరం లేదని, దాన్ని అరికట్టాలంటే ఈ జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలని పేర్కొన్నారు. తెలంగాణ వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఈ వీడియోను రూపొందించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని