జనతా కర్ఫ్యూ: 14గంటలు.. 28 మంది సెలబ్రిటీలు

కరోనా వైరస్‌కు అడ్డుకట్ట వేసేందుకు ప్రధాని నరేంద్రమోదీ ‘జనతాకర్ఫ్యూ’కి పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. ప్రధాని పిలుపు మేరకు ఇప్పటికే సినీ ఇండస్ట్రీకి చెందిన పలువురు సెలబ్రిటీలు ‘జనతా కర్ఫ్యూ’కు మద్దతు ప్రకటించారు. అంతేకాకుండా ప్రతి ఒక్క భారతీయుడు కర్ఫ్యూలో స్వచ్ఛందంగా భాగం కావాలని వారు కోరారు....

Published : 22 Mar 2020 10:50 IST

మేం సిద్ధం.. మీరు సిద్ధమేనా..!

హైదరాబాద్‌: కరోనా వైరస్‌కు అడ్డుకట్ట వేసేందుకు ప్రధాని నరేంద్రమోదీ ‘జనతాకర్ఫ్యూ’కి పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. ప్రధాని పిలుపు మేరకు ఇప్పటికే సినీ ఇండస్ట్రీకి చెందిన పలువురు సెలబ్రిటీలు ‘జనతా కర్ఫ్యూ’కు మద్దతు ప్రకటించారు. అంతేకాకుండా ప్రతి ఒక్క భారతీయుడు కర్ఫ్యూలో స్వచ్ఛందంగా భాగం కావాలని వారు కోరారు. ఈ నేపథ్యంలో తాజాగా ‘జనతా కర్ఫ్యూ’ని విజయవంతం చేసేందుకు ఇళ్లకే పరిమితమైన పలువురు టాలీవుడ్‌ తారలు ‘మనందరి కోసం’ అనే పేరుతో ఇన్‌స్టా వేదికగా అభిమానులతో ముచ్చటించడానికి సిద్ధమయ్యారు. 

ఈ మేరకు ఆదివారం ఉదయం ఏడు గంటల నుంచి రాత్రి 8.30 గంటల వరకూ మొత్తం 28మంది నటీనటులు ప్రతి అరగంటకు ఒకరు చొప్పున ఇన్‌స్టా లైవ్‌లో ముచ్చటించనున్నారు. దీంతో ఉదయం 7 గంటలకు మంచులక్ష్మి, 8 గంటలకు కాజల్‌, 9 గంటకు ఇషా రెబ్బా, 9.30 గంటలకు రాజ్‌ తరుణ్‌, మధ్యాహ్నం 12.30 గంటలకు అల్లరి నరేశ్‌, ఒంటిగంటకు సత్యదేవ్‌, సాయంత్రం 4 గంటలకు నిహారిక, రాత్రి 7 గంటలకు సుధీర్‌బాబు, చివరిగా రాత్రి 8.30 నిమిషాలకు రానా దగ్గుబాటి మనతో ముచ్చటించనున్నారు. ‘జనతాకర్ఫ్యూ’ని ఫాలో అవుతూ.. ఇన్‌స్టా లైవ్‌లో మీతో ముచ్చటించేందుకు వాళ్లు సిద్ధమయ్యారు.

‘జనతా కర్ఫ్యూ’ దేశవ్యాప్తంగా కొనసాగుతోంది. సాయంత్రం ఐదు గంటలు కాగానే ప్రతి ఒక్కరూ తమ ఇంటి గుమ్మాల వద్దకు చేరుకుని కరతాళ ధ్వనులతో ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో మన కోసం పనిచేస్తోన్న వైద్య, ఆరోగ్య సిబ్బందితోపాటు ఇతర రంగాల్లోని సిబ్బందిని హర్షించాలని ప్రధాని సూచించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని