మార్ఫింగ్‌ ఫొటోపై అనుపమ ఆగ్రహం

కథానాయిక అనుపమ పరమేశ్వరన్‌ ఫేస్‌బుక్‌ ఖాతా హ్యాక్‌ అయ్యింది. దీన్ని గుర్తించిన ఆమె అభిమానులకు విషయం తెలిపారు. ఆపై సెక్యూరిటీ కారణాల వల్ల ఆమె ఖాతాను డిలీట్‌ చేశారు. అంతేకాదు కొందరు ఆమె ఫొటోలను మార్ఫింగ్‌ చేసి, సోషల్‌మీడియాలో షేర్‌ చేస్తున్నారు.....

Published : 10 Apr 2020 15:30 IST

హైదరాబాద్‌: కథానాయిక అనుపమ పరమేశ్వరన్‌ ఫేస్‌బుక్‌ ఖాతా హ్యాక్‌ అయ్యింది. దీన్ని గుర్తించిన ఆమె అభిమానులకు విషయం తెలిపారు. ఆపై సెక్యూరిటీ కారణాల వల్ల ఆమె ఖాతాను డిలీట్‌ చేశారు. అంతేకాదు కొందరు ఆమె ఫొటోలను మార్ఫింగ్‌ చేసి, సోషల్‌మీడియాలో షేర్‌ చేస్తున్నారు. ఈ మేరకు అనుపమ ఇన్‌స్టాగ్రామ్‌ స్టోరీస్‌ ద్వారా స్పందించారు. మార్ఫింగ్‌ ఫొటోను, ఒరిజినల్‌ ఫొటోను షేర్‌ చేస్తూ.. ‘ఇది ఫేక్‌.. ఇలాంటి చెత్త పనులు చేయడానికి చాలా సమయం దొరికినట్లుంది..’ అని అసహనం వ్యక్తం చేశారు. అంతేకాదు ఇలాంటి ఫొటోలు షేర్‌ చేయొద్దని, ఇవి ఆవేదనకు గురి చేస్తాయని తెలిపారు. ఇలాంటి పనులు ఎలా చేస్తారని ప్రశ్నించారు.

అనుపమ ‘అ..ఆ’తో సహాయ నటిగా తెలుగులో కెరీర్‌ ఆరంభించారు. ఆపై ‘శతమానం భవతి’, ‘ఉన్నది ఒక్కటే జిందగీ’తో గుర్తింపు పొందారు. చివరగా ‘రాక్షసుడు’ చిత్రంలో కనిపించారు. ప్రస్తుతం అనుపమ చేతిలో ఓ మలయాళ, ఓ తమిళ సినిమా ఉన్నాయి. మలయాళ చిత్రానికి సహాయ దర్శకురాలిగానూ వ్యవహరిస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని