‘ఆర్‌ఆర్‌ఆర్‌’లో నవదీప్‌: క్లారిటీ ఇచ్చిన నటుడు

టాలీవుడ్‌ నటుడు నవదీప్‌ క్వారంటైన్‌లో కొత్త ప్రయోగాలు చేస్తున్నారు. తన లుక్‌ను కాస్త మార్చారు. కోరమీసాలతో తీసుకున్న ఫొటోను సోషల్‌మీడియాలో షేర్‌ చేశారు. దీనికి మంచి స్పందన లభించింది. నవదీప్‌ సిక్స్‌ప్యాక్‌లో ఉండటం, ఇప్పుడు కోరమీసాలతో కనిపించడంతో నెటిజన్లలో ఆసక్తి ....

Published : 12 Apr 2020 21:51 IST

హైదరాబాద్‌: టాలీవుడ్‌ నటుడు నవదీప్‌ క్వారంటైన్‌లో కొత్త ప్రయోగాలు చేస్తున్నారు. తన లుక్‌ను కాస్త మార్చారు. కోరమీసాలతో తీసుకున్న ఫొటోను సోషల్‌మీడియాలో షేర్‌ చేశారు. దీనికి మంచి స్పందన లభించింది. నవదీప్‌ సిక్స్‌ప్యాక్‌లో ఉండటం, ఇప్పుడు కోరమీసాలతో కనిపించడంతో నెటిజన్లలో ఆసక్తి నెలకొంది. దీంతో ఓ వ్యక్తి ‘ఆర్‌.ఆర్‌.ఆర్‌’లో నటిస్తున్నారా? అని ప్రశ్నించారు. దీనికి నవదీప్‌ సమాధానం ఇచ్చారు. ‘లేదు.. నటించడం లేదు’ అని స్పష్టత ఇచ్చారు.

ప్రముఖ దర్శకుడు ఎస్‌.ఎస్‌. రాజమౌళి తెరకెక్కిస్తున్న సినిమా ‘ఆర్‌.ఆర్‌.ఆర్‌’. అల్లూరి సీతారామరాజుగా రామ్‌ చరణ్‌, కొమరం భీమ్‌గా ఎన్టీఆర్‌ నటిస్తున్నారు. అలియా భట్‌, ఒలీవియా మోరిస్‌ కథానాయికలు. దానయ్య నిర్మిస్తున్నారు. వచ్చే ఏడాది జనవరి 8న ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు. దాదాపు రూ.350 కోట్లతో ఈ సినిమాను రూపొందిస్తున్నట్లు తెలిసింది. లాక్‌డౌన్‌ కారణంగా అన్ని చిత్రాలతోపాటు ఈ సినిమా షూటింగ్‌ కూడా ఆగింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని