మంచు మనోజ్‌ పాటకు కేటీఆర్‌ ప్రశంస

కథానాయకుడు మంచు మనోజ్‌, ఆయన మేనకోడలు విద్య నిర్వణ కలిసి పాడిన పాటను తెలంగాణ మంత్రి కేటీఆర్‌ మెచ్చుకున్నారు. ‘చల్లగుంటామురా, సక్కగుంటామురా.. చీకటి ఉండిపోదురా.. మళ్లీ వెలుగొస్తదిరా..’ అని సాగే ఈ గీతాన్ని ఆదివారం సాయంత్రం విడుదల చేశారు......

Published : 19 Apr 2020 20:35 IST

చీకటి ఉండిపోదురా.. మళ్లీ వెలుగొస్తది రా..!

హైదరాబాద్‌: కథానాయకుడు మంచు మనోజ్‌, ఆయన మేనకోడలు విద్య నిర్వణ కలిసి పాడిన పాటను తెలంగాణ మంత్రి కేటీఆర్‌ మెచ్చుకున్నారు. ‘చల్లగుంటామురా, సక్కగుంటామురా.. చీకటి ఉండిపోదురా.. మళ్లీ వెలుగొస్తదిరా..’ అని సాగే ఈ గీతాన్ని ఆదివారం సాయంత్రం విడుదల చేశారు. వైద్యులు, పారిశుద్ధ్య కార్మికులు, పోలీసు అధికారుల సేవల్ని గుర్తు చేస్తూ ఈ పాట సాహిత్యం రాశారు. ఇంట్లోనే ఉండమని, జాగ్రత్తలు పాటించమని కోరారు. కరోనా వైరస్‌ నియంత్రణపై అవగాహన కల్పిస్తూ పాటను రూపొందించారు. అచు రాజమణి ఈ పాటకు సంగీతం అందించారు. ‘అంతా బాగుంటంరా..’ అనే టైటిల్‌తో విడుదలైన ఈ గీతం యూట్యూబ్‌లో శ్రోతల్ని ఆకట్టుకుంటోంది. మంచు లక్ష్మి కుమార్తె విద్య నిర్వణ గాత్రం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

దీన్ని చూసిన కేటీఆర్‌ ట్విటర్‌లో స్పందించారు. ‘ఈ చీకటి ఇలాగే ఉండిపోదని, మళ్లీ వెలుగు వస్తుందని.. గొప్ప ఆత్మస్థైర్యం ఇచ్చే గీతం. మన హృదయాల్లో పాజిటివిటీ నింపి, స్ఫూర్తినిచ్చే మనోజ్‌ గీతం’ అని పోస్ట్‌ చేశారు. కేటీఆర్‌కు మనోజ్‌ ధన్యవాదాలు తెలిపారు. అనంతరం ‘మన సంరక్షణ కోసం ఇటువంటి క్లిష్ట పరిస్థితుల్లోనూ పనిచేస్తున్న పోలీసులు, వైద్యులు, పారిశుద్ధ్య కార్మికులకు ఈ పాట అంకితం’ అని ఈ సందర్భంగా మనోజ్‌ ట్వీట్‌ చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని