టాప్‌ 25 చిత్రాల్లో ఇది తప్పక ఉంటుంది

ఈ తరం, ఆ తరం అనే తేడా లేకుండా అన్ని తరాల వారు చూడదగిన ఎవర్‌గ్రీన్‌ క్లాసిక్‌ చిత్రం ‘జగదేకవీరుడు అతిలోక సుందరి’ అని అగ్రకథానాయకుడు చిరంజీవి అన్నారు. దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు అద్భుత సృష్టిలో తెరకెక్కిన ఈ సినిమా 1990లో విడుదలై ...

Published : 07 May 2020 15:51 IST

‘జగదేకవీరుడు అతిలోక సుందరి’ గురించి చిరు మాట

హైదరాబాద్‌: ఈ తరం, ఆ తరం అనే తేడా లేకుండా అన్ని తరాల వారు చూడదగిన ఎవర్‌గ్రీన్‌ క్లాసిక్‌ చిత్రం ‘జగదేకవీరుడు అతిలోక సుందరి’ అని అగ్రకథానాయకుడు చిరంజీవి అన్నారు. దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు అద్భుత సృష్టిలో తెరకెక్కిన ఈ సినిమా 1990లో విడుదలై బ్లాక్‌బస్టర్‌ విజయాన్ని సొంతం చేసుకుంది. దేవకన్యగా శ్రీదేవి పలికించిన హావభావాలతోపాటు చిరంజీవి నటన, డ్యాన్స్‌ ప్రేక్షకులను ఎంతగానో మెప్పించాయి. ఇళయరాజా అందించిన సంగీతానికి ప్రేక్షకులు ఫిదా అయ్యారు. మే 9తో ఈ సినిమా విడుదలై 30 సంవత్సరాలైన సందర్భంగా సదరు క్లాసిక్‌ మూవీకి సంబంధించిన మూడు ఆసక్తికర విషయాలను నాని వాయిస్‌ ఓవర్‌తో మూడు రోజులపాటు విడుదల చేయనున్నట్లు ఇటీవల చిత్ర నిర్మాణ సంస్థ వైజయంతి మూవీస్‌ ప్రకటించింది.

కాగా, తాజాగా  చిరు ఓ ప్రత్యేక వీడియోను ట్విటర్‌ వేదికగా షేర్‌ చేశారు. ‘‘జగదేక వీరుడు అతిలోక సుందరి’ చిత్రం విడుదలై 30 సంవత్సరాలైన సందర్భంగా ఆ సినిమాతో అనుబంధం ఉన్న ప్రతి ఒక్కరికీ నా హృదయ పూర్వక శుభాభినందనలు తెలియజేస్తున్నాను. సినిమా అనేది సమష్ఠి కృషి అని చెప్పడానికి ఇదే సరైన ఉదాహరణ. ప్రతిఒక్కరూ తమ ప్రతిభను కనబరిచి ఈ చిత్రాన్ని ఓ క్లాసిక్‌గా మలచారు. తెలుగు చిత్ర పరిశ్రమలోని టాప్‌ 25 చిత్రాల్లో ఈ సినిమాకి తప్పకుండా ఓ చోటు ఉంటుంది. ఇది టైమ్‌లెస్‌ మూవీ. ఆ తరం, ఈ తరం అని లేకుండా అందరూ చూడదగిన ఎవర్‌ క్లాసిక్‌ మూవీ. ఇలాంటి సినిమాలో నటించే అవకాశం దక్కడం నా నట జీవితంలో ఓ అదృష్టంగా భావిస్తున్నాను’ అని చిరు పేర్కొన్నారు.

 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని