God Father: ‘గాడ్‌ ఫాదర్’ ట్రైలర్‌ వచ్చేసింది.. చిరు యాక్షన్‌ అదిరింది

ఎప్పుడెప్పుడా? అని సినీ అభిమానులు ఎదురు చూస్తున్న‘గాడ్ ఫాదర్‌’ ట్రైలర్‌ వచ్చేసింది. వారి అంచనాలకు తగ్గ కంటెంట్‌తో నెట్టింట సందడి చేస్తోంది.

Published : 28 Sep 2022 20:01 IST

అనంతపురం: ఎప్పుడెప్పుడా? అని సినీ అభిమానులు ఆసక్తిగా ఎదురు చూసిన ‘గాడ్ ఫాదర్‌’ (God Father) ట్రైలర్‌ వచ్చేసింది. వారి అంచనాలకు తగ్గ కంటెంట్‌తో నెట్టింట సందడి చేస్తోంది. చిరంజీవి (Chiranjeevi) హీరోగా మోహన్‌రాజా తెరకెక్కించిన చిత్రమే ‘గాడ్ ఫాదర్‌’. అక్టోబరు 5న ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్న నేపథ్యంలో చిత్ర బృందం బుధవారం ప్రీ రిలీజ్‌ ఈవెంట్ నిర్వహించింది. అందులో భాగంగా ట్రైలర్‌ను విడుదల చేసింది. చిరంజీవి యాక్షన్‌, పవర్‌ఫుల్‌ డైలాగ్స్‌, తమన్‌ అందించిన నేపథ్య సంగీతం ట్రైలర్‌లో ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. చిరు కొత్త లుక్‌ అందరినీ ఆకట్టుకునేలా ఉంది. ‘గాడ్‌ ఫాదర్’.. మలయాళ సూపర్‌ హిట్‌ చిత్రం ‘లూసీఫర్‌’ రీమేక్‌గా రూపొందిన సంగతి తెలిసిందే. ఇక్కడి నేటివిటీకి తగ్గట్టు ‘లూసీఫర్‌’ కథలో చాలా మార్పులు చేసినట్టు ట్రైలర్‌ చూస్తే అర్థమవుతోంది. నయనతార, సల్మాన్‌ఖాన్‌, సత్యదేవ్‌, సముద్రఖని, బ్రహ్మాజీ, సునీల్‌ కీలక పాత్రలు పోషించిన ‘గాడ్‌ ఫాదర్‌’ ట్రైలర్‌ మీరూ చూసేయండి..


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని