Gautham Menon: ప్రతినాయకుడి పాత్రలు చేయడం ఇష్టం: గౌతమ్‌మేనన్‌

విఘ్నేశ్‌ శివాన్‌ దర్శకత్వంలో తమిళ సూపర్‌స్టార్‌ అజిత్‌కుమార్‌, నయనతారల కలయికలో ఓ సినిమా(AK 62) రానున్న విషయం తెలిసిందే. ఈ సినిమాను ప్రకటించిన దగ్గరి నుంచే భారీ స్థాయిలో అంచనాలు నెలకొన్నాయి.

Published : 23 Sep 2022 19:01 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: విఘ్నేశ్‌ శివన్‌ దర్శకత్వంలో తమిళ సూపర్‌స్టార్‌ అజిత్‌కుమార్‌, నయనతారల కలయికలో ఓ సినిమా(AK 62) రానున్న విషయం తెలిసిందే. ఈ సినిమాను ప్రకటించిన దగ్గరి నుంచే భారీ స్థాయిలో అంచనాలు నెలకొన్నాయి. ఇంకా పేరు ఖరారు కానీ ఈ సినిమా గురించి ఓ వార్త జోరుగా ప్రచారమవుతోంది. ఈ చిత్రంలో ప్రముఖ దర్శకుడు గౌతమ్‌మేనన్‌ విలన్‌ పాత్రలో నటించనున్నారనే ఊహాగానాలు మొదలయ్యాయి. వీటికి చెక్‌ పెడుతూ గౌతమ్‌మేనన్‌ ఓ ఇంటర్వ్యూలో సమాధానం చెప్పారు.

‘‘విఘ్నేశ్‌ నాకు చాలా మంచి ఫ్రెండ్‌. అయితే ఈ సినిమాలోని పాత్ర గురించి నాకు ఇంకా ఎటువంటి సమాచారం లేదు. నా దృష్టికి ఏ వార్త రాలేదు. ఒకవేళ విలన్‌ పాత్రకోసం నన్ను సంప్రదిస్తే నేను కచ్చితంగా ఒప్పుకొంటాను. ఎందుకంటే నాకు ప్రతినాయకుడిగా నటించడం ఇష్టం’’ అన్నారు. అలాగే విజయ్‌తో నటించాలని ఉందంటూ తన కోరికను బయటపెట్టాడు ఈ డైరెక్టర్‌. ‘‘చాలా కాలంగా విజయ్‌తో కలిసి నటించే అవకాశం కోసం ఎదురుచూస్తున్నా.  అతని వైపు నుంచి ఏమైనా అవకాశాలు వస్తే నేను నటిస్తాను.’’ అంటూ విజయ్‌తో నటించాలనే తన కోరికను చెప్పాడు గౌతమ్‌ మేనన్‌.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని