Mahesh Babu: గుంటూరు కారం.. ఆట చూస్తారా!

రౌడీ రమణ... సినిమా స్కోపు, సెవెన్టీ ఎమ్‌.ఎమ్‌. మరి ఆట చూస్తావా? అంటున్నాడు మహేశ్‌బాబు. మరి ఆ రమణ కథేమిటో తెలియాలంటే ‘గుంటూరు కారం’ చూడాల్సిందే.

Updated : 08 Jan 2024 09:27 IST

రౌడీ రమణ... సినిమా స్కోపు, సెవెన్టీ ఎమ్‌.ఎమ్‌. మరి ఆట చూస్తావా? అంటున్నాడు మహేశ్‌బాబు. మరి ఆ రమణ కథేమిటో తెలియాలంటే ‘గుంటూరు కారం’ చూడాల్సిందే. మహేశ్‌బాబు కథానాయకుడిగా... త్రివిక్రమ్‌ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రమిది. శ్రీలీల, మీనాక్షి చౌదరి కథానాయికలు. హారిక అండ్‌ హాసిని క్రియేషన్స్‌ పతాకంపై ఎస్‌.రాధాకృష్ణ (చినబాబు) నిర్మించారు. సంక్రాంతి సందర్భంగా ఈ నెల 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా ఆదివారం ట్రైలర్‌ని విడుదల చేశారు. ‘మీరు మీ పెద్దబ్బాయిని అనాథలా వదిలేశారంటున్నారు. దీనికి మీ సమాధానం...’ అంటూ మొదలయ్యే ఈ ట్రైలర్‌కి మహేశ్‌ పాత్ర ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ‘మజా వచ్చిందా? హార్ట్‌ బీట్‌ పెరిగిందా? ఈల వేయాలనిపించిందా?...’ అంటూ మాస్‌ అవతారంలో మహేశ్‌ చేసిన సందడి ఆకట్టుకుంటుంది. ‘‘గుంటూరు కారం.. ఎర్రగా.. ఘాటుగా కనిపిస్తాది. ఒక్కసారి నాలిక్కి తగిలిందంటే.. కళ్లలో వచ్చేది నీళ్లే’’ అంటూ ట్రైలర్‌ ఆఖర్లో వినిపించిన సంభాషణ సినిమాపై అంచనాలు పెంచేలా ఉంది. మొత్తంగా ట్రైలర్‌ను తీర్చిదిద్దిన తీరును బట్టి ఈ సంక్రాంతికి మహేశ్‌ ప్రేక్షకులకు మంచి మాస్‌ మీల్స్‌ రుచి చూపించనున్నట్లు అర్థమవుతోంది. సంగీతం: తమన్‌, ఛాయాగ్రహణం: మనోజ్‌ పరమహంస.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని