Ustaad Bhagat Singh: పవన్‌ సినిమాపై తప్పుడు ప్రచారం.. దర్శకుడి కౌంటర్‌

‘ఉస్తాద్‌ భగత్‌సింగ్‌పై ఆసక్తిక వ్యాఖ్యలు చేశారు దర్శకుడు హరీశ్‌ శంకర్‌ (Harish Shankar).

Published : 16 Mar 2023 01:19 IST

హైదరాబాద్‌: పవన్‌ కల్యాణ్‌ (Pawan Kalyan) నటిస్తోన్న సరికొత్త చిత్రాల్లో ‘ఉస్తాద్‌ భగత్‌సింగ్‌’ (Ustaad Bhagat Singh) ఒకటి. హరీశ్‌ శంకర్‌ (Harish Shankar) దర్శకుడు. త్వరలో సెట్స్‌పైకి వెళ్లనున్న ఈ సినిమాపై తాజాగా నెట్టింట తప్పుడు కథనాలు చక్కర్లు కొడుతున్నాయి. దానిపై స్పందించిన చిత్ర దర్శకుడు.. తమ సినిమా గురించి తప్పుడు సమాచారాన్ని ట్వీట్‌ చేసిన ఓ వెబ్‌సైట్‌కు ట్విటర్‌ వేదికగా బదులిచ్చారు.

‘‘ఉస్తాద్‌ భగత్‌సింగ్‌’(Ustaad Bhagat Singh)లో మార్పులు.. ‘తెరీ’లో చిన్న పాప చేసిన రోల్‌ను తెలుగులో బాబు రోల్‌గా మారుస్తున్నారు. దానికి సంబంధించిన ఆడిషన్స్‌ కూడా మొదలుపెట్టారు. అలాగే ‘తెరీ’లో విజయ్ బేకరీ ఓనర్‌గా కనిపించగా.. తెలుగులో పవన్‌ కల్యాణ్‌ లెక్చరర్‌గా కనిపించనున్నారు’’ అని పేర్కొంటూ ఓ ఎంటర్‌టైన్‌మెంట్‌ పోర్టల్‌ ట్వీట్‌ చేసింది. ఇది నెట్టింట వైరల్‌గా మారడంతో నెటిజన్లు దీని గురించే మాట్లాడుకుంటున్నారు. కాగా, ఈ ట్వీట్‌పై తాజాగా హరీశ్‌ శంకర్‌ స్పందిస్తూ.. అదంతా తప్పుడు ప్రచారమని స్పష్టం చేశారు. వాటిల్లో ఏ మాత్రం నిజం లేదని చెప్పారు. అంతేకాకుండా ట్విటర్‌లో తాను ఎప్పుడూ యాక్టివ్‌గానే ఉంటానని.. ఇలాంటి పోస్టులు పెట్టేముందు తనను ఒక్కసారి సంప్రదించాలంటూ కౌంటర్‌ విసిరారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని