Bigg Boss Telugu6: ‘బిగ్‌బాస్‌-6’ హౌస్‌లోకి వెళ్లిన కంటెస్టెంట్‌లు వీళ్లే.. కంప్లీట్‌ లిస్ట్‌!

Bigg Boss Telugu6: ‘బిగ్‌బాస్‌-6’ హౌస్‌లోకి వెళ్లిన కంటెస్టెంట్‌లు వీళ్లే...

Updated : 04 Sep 2022 21:54 IST

హైదరాబాద్‌: బుల్లితెర తెలుగు ప్రేక్షకులను అలరిస్తున్న బిగ్‌బాస్‌ మరో సీజన్‌ మొదలైపోయింది. ఇప్పటివరకూ అయిదు సీజన్లు పూర్తి చేసుకున్న ‘బిగ్‌బాస్‌’ మరింత ఎంటర్‌టైన్‌ చేయడానికి 6వ సీజన్‌తో అడుగుపెట్టింది. గత మూడు సీజన్లకు హోస్ట్‌గా వ్యవహరించిన నాగార్జున.. ఈ కొత్త సీజన్‌లోనూ వినోదం పంచనున్నారు. ఈసారి హౌస్‌లోకి మొత్తం 21మంది కంటెస్టెంట్‌లు వెళ్లారు. మొత్తం 15 వారాల పాటు ఈ సీజన్‌ జరగనుంది.

బిగ్‌బాస్‌ సీజన్‌-6లో హౌస్‌లోకి వెళ్లిన కంటెస్టెంట్‌లు వీళ్లే

కీర్తి భట్‌

బుల్లితెర నటి కీర్తిభట్‌ హౌస్‌లోకి అడుగుపెట్టిన తొలి కంటెస్టెంట్‌గా నిలిచారు. హౌస్‌లోకి వెళ్లేముందు కీర్తిభట్‌ మాట్లాడుతూ.. ‘నా  లైఫ్‌లో బెస్ట్‌ రిలేషన్‌షిప్‌ నా తండ్రితో ఉండేది. ప్రస్తుతం ఆయన లేరు. చిన్నప్పుడు జరిగిన రోడ్డు ప్రమాదంలో మొత్తం కుటుంబాన్ని కోల్పోయా. నేను ఒక్కదాన్నే మిగిలాను. ఒక పాపను దత్తత తీసుకున్నా. ఇక బిగ్‌బాస్‌ విషయానికొస్తే, లోపల వేర్వేరు వ్యక్తులతో కలిసి ఉండాలి. ఎలాంటి మనుషులతోనైనా బతకగలననే విషయాన్ని ఇక్కడ నేర్చుకుంటా’’ అని కీర్తి భట్‌ చెబుతూ హౌస్‌లోపలికి వెళ్లింది.


పింకీ అలియాస్‌ సుదీప

పింకీగా అనేక సినిమాల్లో బాలనటిగా అలరించారు సుదీప. ఇప్పుడు రెండో కంటెస్టెంట్‌గా బిగ్‌బాస్‌ హౌస్‌లోకి వెళ్లారు. ఇన్నేళ్ల కెరీర్‌లో అందరితోనూ తాను నటించానని, అయితే నాగార్జునను కలిసే అవకాశం బిగ్‌బాస్ ద్వారా రావడం సంతోషంగా ఉందని సుదీప చెప్పారు.


శ్రీహాన్‌

‘‘సిరి చాలా బాగుంది. నేను ఎప్పుడు బయటకు వెళ్లినా, ‘త్వరగా వచ్చేయ్‌’ అనేది. కానీ, ఇప్పుడు ‘100 రోజుల వరకూ బయటకు రావొద్దు’ అంటోంది. గత సీజన్‌లో సిరి వల్ల చాలా జరిగాయి. అవన్నీ కరెక్ట్‌ చేసుకోవాలి. సిరి కోల్పోయిన దాన్ని, గిఫ్ట్‌గా ఇవ్వాలనుకుంటున్నా. నాకు ఓర్పు, సహనం ఎక్కువే. గత సీజన్‌ చూసి, చాలా కోపం వచ్చింది. ఇప్పుడు అంతా కంట్రోల్‌లో ఉంది’ అంటూ శ్రీహాన్‌ బిగ్‌బాస్‌ హౌస్‌లోకి వెళ్లాడు.


నేహా చౌదరి

‘‘ఈ హౌస్‌లోకి ఒక వార్నింగ్‌తో వచ్చా. ఈ సీజన్‌కు వచ్చే ముందు ఇంట్లో నాకు పెళ్లి సంబంధాలు చూడటం మొదలు పెట్టారు. అనుకోకుండా బిగ్‌బాస్‌ ఆఫర్‌ రావడంతో వాటిని పక్కన పెట్టేశా. మెడలో తాళి, కాలికి మెట్టెలు పెట్టుకుని, హౌస్‌లోకి వచ్చి ఏం చేస్తాను. ఇప్పుడైతే నా నిర్ణయాలు నేను తీసుకోవచ్చు’’ అంటూ నేహా చౌదరి చెప్పుకొచ్చింది.


చలాకీ చంటి

‘‘హౌస్‌లో చలాకీ చంటి అంటే ఏంటో చూపిస్తా..  ‘ఎంటర్‌టైన్‌మెంట్‌కు అడ్డా ఫిక్స్‌.. చలాకీ చంటి సిక్స్‌’’ అంటూ వేదికపై చంటి నవ్వులు పంచారు.


శ్రీసత్య

సీజన్‌-6లో ఆరో కంటెస్టెంట్‌గా శ్రీసత్య వెళ్లారు. ఈ సందర్భంగా వేదికపై మాట్లాడుతూ.. ‘అందరిలాగే నేనూ సాధారణ అమ్మాయిని. మోడలింగ్‌, యాక్టింగ్‌ అంటే ఇష్టం. ఎంబీబీఎస్‌ కూడా పక్కన పెట్టి ఇటువైపు వచ్చా. అందుకే ఈ రంగంలోకి వచ్చా. మిస్‌ విజయవాడ, మిస్‌ ఆంధ్రప్రదేశ్‌ స్పెషల్‌ అవార్డులు గెలుచుకున్నా. జంక్‌ ఫుడ్‌ అంటే చాలా ఇష్టం. ఎంత తిన్నా లావు కావటం లేదు’’ అంటూ శ్రీసత్య సరదాగా చెప్పుకొచ్చారు.


అర్జున్‌కల్యాణ్‌

హౌస్‌లోకి ఏడో పోటీదారుడిగా తెలుగు నటుడు అర్జున్‌ కల్యాణ్‌ అడుగుపెట్టారు. ‘‘చిన్నప్పటి నుంచి నేను మీ(నాగార్జున) అభిమానిని. వైజాగ్‌ గీతంలో బీటెక్‌ చేశా. యూఎస్‌ వెళ్లి మాస్టర్స్‌ చేశా. సినిమాలపై ఆసక్తితో న్యూయార్క్‌ ఫిల్మ్‌ అకాడమీలో యాక్టింగ్‌ కోర్సు చేశా. ప్రస్తుతం చిన్న చిన్న పాత్రల్లో నటిస్తున్నా. భవిష్యత్‌లో మంచి సినిమాలు చేయాలన్నది నా టార్గెట్‌. అందుకు బిగ్‌బాస్‌ నాకు ఉపయోగపడుతుందని అనుకుంటున్నా. అందుకే ఇక్కడకు వచ్చా. ప్రేక్షకుల హృదయాలను గెలుచుకోవడమే నా మొదటి టాస్క్‌’’ అని అర్జున్‌ కల్యాణ్‌ చెప్పుకొచ్చారు.


గీతూ రాయల్‌

‘‘నా పూర్తి పేరు కోవూరు గ్రీష్మ గీతిక లేఖరాయలు. అందరూ గీతూ అని పిలుస్తారు. గ్రీష్మ పేరు కలిసిరాలేదు. అందుకే గీతూ రాయల్‌ అని మార్చుకున్నా. ఇక వికాస్‌ నా చిన్నప్పటి నుంచి ఫ్రెండ్‌. నా గురించి అంతా తెలుసు. మాది పెద్దలు కుదిర్చిన వివాహమే. వెటర్నిటీ డాక్టర్ అవుదామనుకున్నా. ఏడాదికి ఒక జాబ్‌ చేస్తున్నా. సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌గా, ఆర్జేగా, నటిగా చేశా. ఇప్పుడు బిగ్‌బాస్‌లోకి వచ్చా. చిన్నప్పటి నుంచి నాకు అభద్రతా భావం ఎక్కువ. దాన్ని తొలగించాలి అందుకే ఇక్కడకు వచ్చా.’’ అంటూ గీతూ రాయల్‌ గలగల మాట్లాడింది.


అభినయశ్రీ


రోహిత్‌-మరీనా


బాలాదిత్య


వసంతి


షానిసాల్మన్‌


ఇనాయా సుల్తానా


ఆర్జే సూర్య


ఫైమా


ఆదిరెడ్డి


రాజశేఖర్‌


అరోహి రావు


రేవంత్‌

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని