Cirkus: ఓటీటీలో స్ట్రీమింగ్‌కు సిద్ధమైన మరో ఫ్లాప్‌ మూవీ!

రణ్‌వీర్‌ సింగ్‌-రోహిత్‌శెట్టి కాంబోలో వచ్చిన ‘సర్కస్‌’ మూవీ ఓటీటీలో స్ట్రీమింగ్‌కు సిద్ధమైంది.

Published : 02 Feb 2023 13:32 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: రణ్‌వీర్‌ సింగ్‌, పూజా హెగ్డే, జాక్విలైన్‌ ఫెర్నాండేజ్‌ కీలక పాత్రల్లో నటించిన పీరియాడిక్‌ కామెడీ చిత్రం ‘సర్కస్‌’ (Cirkus). క్రిస్మస్‌ కానుకగా థియేటర్‌లో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద ఘోర పరజయాన్ని మూటగట్టుకుంది. రూ.150కోట్ల బడ్జెట్‌తో తీస్తే రూ.60కోట్లు మాత్రమే వసూలు చేసింది. ఆల్‌టైమ్‌ ఫ్లాప్‌ మూవీగా రికార్డు సృష్టించింది. ఇప్పుడు ఈ చిత్రం ఓటీటీ వేదికగా స్ట్రీమింగ్‌కు సిద్ధమైంది. ప్రముఖ ఓటీటీ వేదిక నెట్‌ఫ్లిక్స్‌లో ఫిబ్రవరి 17వ తేదీ నుంచి అందుబాటులోకి రానుంది. రణ్‌వీర్‌ సింగ్‌ ద్విపాత్రాభినయం చేసిన ఈ చిత్రాన్ని రోహిత్‌శెట్టి తెరకెక్కించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు