Vikram Vedha: తన పాత్రపై ప్రేక్షకుల అభిప్రాయం అడిగిన స్టార్ హీరో
‘విక్రమ్ వేద’ (Vikram Veda) తాజాగా ఓటీటీలో విడుదలైన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో తన పాత్ర ఎలా ఉందో చెప్పాలంటూ హృతిక్ రోషన్ (Hrithik Roshan) కోరారు.
హైదరాబాద్: హృతిక్ రోషన్ (Hrithik Roshan), సైఫ్ అలీఖాన్ (Saif Ali Khan) ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన చిత్రం ‘విక్రమ్ వేద’ (Vikram Veda). గతేడాది విడుదలైన ఈ సినిమా ఎప్పుడెప్పుడు ఓటీటీలోకి వస్తుందా అని సినీ ప్రియులంతా ఎదురు చూశారు. ఇక తాజాగా ఇది డిజిటల్ ప్రేక్షకుల ముందుకు వచ్చి అలరిస్తోంది. ఈ సందర్భంగా హీరో హృతిక్ రోషన్ చేసిన ఇన్‌స్టా పోస్ట్ నెటిజన్ల దృష్టిని ఆకర్షిస్తోంది.
తమిళంలో విజయవంతమైన ‘విక్రమ్ వేద’కి రీమేక్‌గా బాలీవుడ్‌లో విడుదలైన ఈ చిత్రంలో హృతిక్ రోషన్ గ్యాంగ్‌స్టర్ పాత్రలో కనిపించారు. ఈ పాత్ర గురించి తెలుపుతూ దానిపై ప్రేక్షకుల అభిప్రాయాన్ని అడిగాడు. ‘మీరంతా ఈ సినిమా కోసం ఎంతగానో ఎదురుచూశారని నాకు తెలుసు. నేను ఈ సినిమాలో కొత్తగా చేయడానికి ప్రయత్నించాను. అది నాకు కాస్త ఇబ్బంది కలిగించింది. ఆ పాత్ర మిమ్మల్ని ఆకట్టుకుందా.. లేదా అని తెలుసుకోవాలనుకుంటున్నా. ఓటీటీలో సినిమా చూసిన వాళ్లు నా పాత్రపై అభిప్రాయాన్ని పంచుకోండి’ అని అడిగారు. ప్రస్తుతం ఈ పోస్ట్ వైరలవుతోంది. నెటిజన్లతో పాటు సినీ ప్రముఖులు కూడా కామెంట్స్ చేస్తున్నారు. ‘మీరు తప్ప మరెవ్వరూ ఇలా చేయలేరు’ అని ఒక యూజర్ కామెంట్ చేయగా.. మీ కెరీర్‌లోని అన్ని పాత్రల్లో ఇదే గొప్పది’ అని మరో నెటిజన్ అభిప్రాయం వ్యక్తం చేశారు. గతేడాది సెప్టెంబరు 30న విడుదలైన ఈ చిత్రం జియో సినిమాలో స్ట్రీమింగ్ అవుతోంది. ఇందులో రాధికా ఆప్టే (Radhika Apte) కీలక పాత్రలో నటించింది.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
India News
వీసాల్లో మార్పులు.. అండర్ గ్రాడ్యుయేట్లకు కాదు: యూకే మంత్రి
-
World News
Erdogan: జైలు నుంచి అధ్యక్షపీఠం వరకు.. ఎర్డోగాన్ రాజకీయ ప్రస్థానం..!
-
Politics News
AAP-Congress: ఆర్డినెన్స్‌పై పోరు.. ఆమ్ఆద్మీకి కాంగ్రెస్ మద్దతిచ్చేనా?
-
India News
అవినీతి ఆరోపణలు.. రోల్స్‌రాయిస్‌పై సీబీఐ కేసు
-
India News
హరివంశ్ నారాయణ్.. భావితరాలకు మీరు చెప్పేది ఇదేనా?: జేడీయూ
-
Sports News
IPL 2023: శుభ్‌మన్ గిల్ విషయంలో కోల్‌కతా ఘోర తప్పిదమదే: స్కాట్ స్టైరిస్