International Dance Day: వీరి డ్యాన్స్‌ చూస్తే కళ్లు చెదరాల్సిందే..!

ప్రత్యేక రోజు, పండుగలకు సంబంధించి ‘ఈటీవీ’ సరికొత్త కార్యక్రమాలను రూపొందిస్తుంటుందనే సంగతి తెలిసిందే. ప్రపంచ నృత్య దినోత్సవాన్ని పురస్కరించుకుని తాజాగా ‘నా ఆట చూడు’ అనే ఈవెంట్‌కు శ్రీకారం చుట్టింది.

Updated : 29 Apr 2022 10:07 IST

డ్యాన్స్‌ డే ప్రత్యేకం - ప్రోమో

ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రత్యేక రోజు, పండుగలకు సంబంధించి ‘ఈటీవీ’ సరికొత్త కార్యక్రమాలను రూపొందిస్తుంటుందనే సంగతి తెలిసిందే. ప్రపంచ నృత్య దినోత్సవాన్ని పురస్కరించుకుని తాజాగా ‘నా ఆట చూడు’ అనే ఈవెంట్‌కు శ్రీకారం చుట్టింది. ప్రముఖ కొరియోగ్రాఫర్లు తరుణ్‌, బృందా ఈ కార్యక్రమానికి న్యాయ నిర్ణేతలుగా వ్యవహరించారు. నెట్టింట విడుదలైన ఈ ఎపిసోడ్‌ ప్రోమో వావ్‌ అనిపించేలా ఉంది. ఈ వేదికపై భూషణ్‌ మాస్టర్‌, యశ్‌ మాస్టర్‌తోపాటు మరికొందరు ప్రతిభావంతులు ఇచ్చిన ప్రదర్శన అద్భుతాన్ని తలపించింది. క్లాసికల్‌, మోడర్న్‌.. ఇలా అన్ని రకాల నృత్య మేళవింపులతో వేడుక అదిరిపోయింది. ‘సిరివెన్నెల’ (శ్యామ్‌ సింగరాయ్‌), ‘అందమైన ప్రేమరాణి’ (ప్రేమికుడు), ‘సామజవరగమన’ (అల వైకుంఠపురములో), ‘దొరికినంత దోచుకో’ (సూపర్‌) , ‘పుష్ప’ సినిమాలోని పలు పాటలతో డ్యాన్సర్లు దుమ్మురేపారు. ఈ ఈవెంట్‌కు వ్యాఖ్యాతగా వ్యవహరించిన రష్మీతో హైపర్‌ ఆది, రామ్‌ ప్రసాద్‌ చేసిన కామెడీ గిలిగింతులు పెట్టిస్తోంది. ఈ వండర్‌ఫుల్‌ డ్యాన్స్‌ పెర్ఫామెన్స్‌ను పూర్తిస్థాయిలో చూడాలంటే మే 1 రాత్రి 7 గం.ల వరకు ఆగాల్సిందే.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని