స్టైలిష్ స్టార్ బన్ని.. ఇక నుంచి ఐకాన్ స్టార్
ఇక నుంచి అల్లు అర్జున్ స్టైలిష్ స్టార్ కాదు.. ఐకాన్ స్టార్ అని డైరెక్టర్ సుకుమార్ అన్నారు. అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో ‘పుష్ప’ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. రష్మిక కథానాయిక. ఫహద్ ఫాజిల్ ప్రతినాయకుడి పాత్రలో కనిపించనున్నారు.
పుష్ప టీజర్ విడుదల వేడుకలో డైరెక్టర్ సుకుమార్
ఇంటర్నెట్ డెస్క్: ఇక నుంచి అల్లు అర్జున్ స్టైలిష్ స్టార్ కాదు.. ఐకాన్ స్టార్ అని డైరెక్టర్ సుకుమార్ అన్నారు. అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో ‘పుష్ప’ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. రష్మిక కథానాయిక. ఫహద్ ఫాజిల్ ప్రతినాయకుడి పాత్రలో కనిపించనున్నారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. ఈ చిత్రం ఆగస్టు 13న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో చిత్రం ‘పుష్ప ఫస్ట్మీట్’ పేరుతో ఓ కార్యక్రమం ఏర్పాటు చేశారు.
ఈ సందర్భంగా డైరెక్టర్ సుకుమార్ మాట్లాడుతూ.. ‘స్టైలిష్‌స్టార్ అనే ట్యాగ్ బన్నీకి ఎప్పుడు వచ్చిందో నాకు తెలియదు. కానీ ఈ సినిమాలో బన్నీ నటన అద్భుతం. ప్రమాణం చేసి చెబుతున్నా.. సినిమా చూసిన తర్వాత మీరే ఆ మాట అంటారు. సినిమాలో బన్ని పెర్ఫార్మెన్స్ చూసిన తర్వాత స్టైలిష్ అనే పదం ఒక్కటే ఆయనకు సరిపోదనిపించింది. నా అభిప్రాయం ప్రకారం.. బన్నీ ఇక స్టైలిష్ స్టార్ కాదు.. ఐకాన్ స్టార్. తన కథల ఎంపిక ప్రత్యేకం.. వేసే డ్రెస్సులు ప్రత్యేకం.. బన్నీ డ్యాన్స్ ప్రత్యేకం.. అందుకే ఈ సినిమా తర్వాత బన్నీని ఐకాన్ స్టార్ లేదా పుష్ప అని పిలుస్తారు. ఈ సినిమా కోసం టెక్నీషియన్లు చాలా కష్టపడ్డారు. సినిమాటోగ్రఫర్ మిరోస్లా బ్రోజెక్ గురించి ప్రత్యేకంగా చెప్పాలి. ఆయన ఏ దేశం నుంచి వచ్చారో తెలియదు. మన భాష రాకున్నా ఎంతో కష్టపడి పనిచేశారు. చివరిగా ఈ సినిమా కోసం పనిచేసిన ప్రతి ఒక్కరికీ పేరుపేరునా కృతజ్ఞతలు’ అని సుకుమార్ తన మాటల్ని ముగించారు.
అనంతరం అల్లు అర్జున్ మాట్లాడారు.. ‘నా జీవితం టేకాఫ్ అయిందే.. సుకుమార్ ‘ఆర్య’తో. అప్పుడే నాకు స్టైలిష్‌స్టార్ అని ట్యాగ్ వచ్చింది. ఇప్పుడు కూడా ఏం జరగబోతుందో కూడా నాకు అర్థమయిపోయింది. అప్పుడు స్టైలిష్ స్టార్ ఇచ్చి.. ఇప్పుడు ఐకాన్ స్టార్ ఇవ్వడం సంతోషంగా ఉంది. ఇక ఈ సినిమా గురించి చెప్పాలంటే.. ఇందులో ఉన్న ‘తగ్గేదే లే’ అనే డైలాగ్ నా జీవితంలో ప్రతిరోజూ నాకునేను చెప్పుకొనే డైలాగ్. తెలుగు సినిమాలు చూస్తున్నందుకు అన్ని ఇండస్ట్రీల ప్రేక్షకులకు ప్రత్యేక కృతజ్ఞతలు’ అని బన్నీ అన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
విజయ్ దేవరకొండ- సుకుమార్ కాంబో.. అప్డేట్ ఇచ్చిన నిర్మాత
ప్రేక్షకులు ఆసక్తి ఎదురుచూస్తున్న వాటిలో విజయ్ దేవరకొండ- సుకుమార్ కాంబినేషన్లో రూపొందననున్న సినిమా ఒకటి. ఎప్పుడు ప్రారంభమవుతుందన్న ప్రశ్నపై నిర్మాత స్పందించారు. -
అప్పుడు నిరాశ చెందా.. ఓపిక విలువేంటో అర్థమైంది: మంచు మనోజ్
‘మిరాయ్’తో ప్రేక్షకులకు కొత్త అనుభూతిని పంచనున్నారు మంచు మనోజ్. ఈ సినిమాలోని ఆయన లుక్ విడుదలైంది. -
ఈ వారం థియేటర్/ఓటీటీలో అలరించే చిత్రాలివే!
గత కొన్ని వారాలుగా బాక్సాఫీస్ వద్ద చిన్న చిత్రాల హవా కొనసాగుతోంది. ఈ వారం కూడా పలు వైవిధ్య చిత్రాలు ప్రేక్షకులను పలకరించడానికి సిద్ధమయ్యాయి. -
‘భారతీయుడు 2’ రిలీజ్ డేట్ ఫిక్స్.. ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ లుక్‌తో అజిత్
కమల్ హాసన్ నటించిన ‘భారతీయుడు 2’ సినిమా విడుదల తేదీ ఖరారైంది. అజిత్ నటిస్తున్న ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ చిత్రంలోని ఆయన ఫస్ట్ లుక్ రిలీజైంది. -
విజయ్ ‘ది గోట్’.. అప్డేట్ షేర్ చేసిన దర్శకుడు
విజయ్ ‘ది గోట్’పై దర్శకుడు వెంకట్ ప్రభు అప్డేట్ ఇచ్చారు. -
‘బుజ్జి’ని పరిచయం చేయనున్న ప్రభాస్.. లేటెస్ట్ అప్డేట్ ఇదే
‘బుజ్జి’ని పరిచయం చేయబోతున్నానంటూ మరో పోస్ట్ పెట్టారు ప్రభాస్. -
‘కన్నప్ప’లో స్టార్ హీరోయిన్.. అధికారికంగా ప్రకటించిన టీమ్
మంచు విష్ణు ‘కన్నప్ప’లో మరో స్టార్ హీరోయిన్ భాగమయ్యారు. ఈ విషయాన్ని తెలుపుతూ టీమ్ పోస్ట్ పెట్టింది. -
ఆ రూమర్స్‌కు చెక్ పెట్టిన నిర్మాణ సంస్థ.. ‘SSMB29’పై క్లారిటీ
రాజమౌళి-మహేశ్‌ల ప్రాజెక్ట్‌కు సంబంధించి వస్తున్న కథనాలపై నిర్మాణ సంస్ధ క్లారిటీ ఇచ్చింది. -
ఖాన్సార్ మరింత ఎరుపెక్కేలా.. ‘సలార్2’లో మరో విలన్‌గా మలయాళ నటుడు
ప్రభాస్, ప్రశాంత్ నీల్ కాంబోలో వస్తున్న ‘సలార్2: శౌర్యంగపర్వం’లో మరో మలయాళ నటుడు వచ్చి చేరారు. -
కంగనా ‘ఎమర్జెన్సీ’ మరోసారి వాయిదా.. కారణమిదే
బాలీవుడ్ నటి కంగనా రనౌత్ (Kangana Ranaut) స్వీయ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘ఎమర్జెన్సీ’(Emergency). ఈ చిత్రం మరోసారి వాయిదా పడింది. -
‘దేవర ముంగిట నువ్వెంత’: ఎన్టీఆర్ మూవీ సాంగ్‌పై నిర్మాత ఆసక్తికర ట్వీట్
ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కుతున్న సినిమా ‘దేవర’. ఈ సినిమా తొలి గీతంపై నిర్మాత నాగవంశీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. -
ప్రేక్షకులు చాలా స్మార్ట్.. ‘పుష్ప’ పాత్రను అలా ఏమీ చూడరు: అల్లు అర్జున్
‘పుష్ప’లో తన పాత్ర గురించి ఆసక్తికర విషయాలను పంచుకున్నారు అల్లు అర్జున్. -
ఈ వారం థియేటర్/ఓటీటీ చిత్రాలివే.. ఇటు ఫన్.. అటు థ్రిల్
ఈ వారం థియేటర్లో, ఓటీటీల్లో సందడి చేసేందుకు పలు సినిమాలు సిద్ధమయ్యాయి. అవేంటంటే? -
‘డబుల్ ఇస్మార్ట్’.. డబుల్ ఇంపాక్ట్.. అప్డేట్ ఇచ్చిన చిత్ర బృందం
రామ్ హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వస్తున్న ‘డబుల్ ఇస్మార్ట్’కు సంబంధించి చిత్రబృందం అప్డేట్ ఇచ్చింది. -
‘కల్కి’ సీజీ వర్క్‌పై నిర్మాత ఫన్నీ పోస్ట్.. నాగ్ అశ్విన్ ఏమన్నారంటే!
‘కల్కి’ సీజీ వర్క్‌పై నిర్మాత ఫన్నీ పోస్ట్ పెట్టారు. -
Prabhas: ప్రభాస్ ‘రాజాసాబ్’ మరింత ఆలస్యం.. కారణమిదే!
Raja Saab: ప్రభాస్, మారుతీ కాంబినేషన్లో రూపొందుతున్న చిత్ర షూటింగ్ మరింత ఆలస్యమయ్యే అవకాశం ఉందని టాలీవుడ్ టాక్. -
‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ మరోసారి వాయిదా.. న్యూ రిలీజ్ డేట్ ఇదే..
విశ్వక్సేన్ హీరోగా రూపొందిన ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ సినిమా మరోసారి వాయిదా పడింది. -
‘ప్రాజెక్ట్-జెడ్’కు సీక్వెల్.. ఈసారి హైఓల్టేజ్ థ్రిల్లర్ ఎలిమెంట్స్‌తో..
Sundeep Kishan: సందీప్ కిషన్ కీలక పాత్రలో నటించిన ‘ప్రాజెక్ట్-జెడ్’కు సీక్వెల్‌గా ‘మాయ-వన్’ రాబోతోంది -
‘కన్నప్ప’లో ప్రభాస్.. అప్డేట్ ఇచ్చిన మంచు విష్ణు
‘కన్నప్ప’ సినిమా క్రేజీ అప్డేట్ ఇచ్చారు హీరో మంచు విష్ణు. అదేంటంటే? -
కమల్ హాసన్ సినిమాలో బాలీవుడ్ హీరో.. గౌరవంగా ఉందంటూ పోస్ట్
కమల్ హాసన్ ‘థగ్ లైఫ్’లో బాలీవుడ్ హీరో అలీ ఫజల్ కీలకపాత్రలో నటిస్తున్నారు. -
విజయ్ దేవరకొండ బర్త్‌డే స్పెషల్.. మూడు సినిమాల అప్డేట్స్ ఇవే..
విజయ్ దేవరకొండ పుట్టినరోజు సందర్భంగా ఆయన సినిమాల అప్డేట్స్ వచ్చేశాయి.
తాజా వార్తలు (Latest News)
-
విజయ్ దేవరకొండ- సుకుమార్ కాంబో.. అప్డేట్ ఇచ్చిన నిర్మాత
-
ఏకంగా ఎనిమిదిసార్లు ఓటేసి.. యూపీలో యువకుడి బాగోతం!
-
‘ఆర్సీబీ రూ.5 కోట్లు డ్రైనేజీలో వేసిందన్నారు.. వాట్సాప్ గ్రూప్ల్లోంచి బయటికి వచ్చాం’
-
‘వారంలో 10 కేజీల గోధుమ పిండెలా తినాలి?’.. క్విక్ కామర్స్ సంస్థపై యూజర్ ఫైర్
-
ఆప్ రూ.7.08 కోట్ల విదేశీ నిధులను సేకరించింది: ఈడీ
-
బ్యాలెన్స్ రూ.6 లక్షలు ఇస్తామన్నా పాయల్ రాజ్‌పుత్ రాలేదు.. : నిర్మాతల మండలి