Sai Pallavi: ‘చంద్రముఖి 2’లో ఆ పాత్రకు సాయిపల్లవి నో చెప్పిందా..?

రాఘవా లారెన్స్‌, కంగనా రనౌత్‌ ప్రధానపాత్రల్లో నటించిన తాజా చిత్రం ‘చంద్రముఖి 2’ (Chandramukhi 2). ఈ సినిమాకు సంబంధించిన ఓ వార్త ప్రస్తుతం సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది.

Published : 05 Sep 2023 17:47 IST

హైదరాబాద్‌: రజనీకాంత్‌, నయనతార, జ్యోతిక ప్రధాన పాత్రల్లో 2005లో వచ్చి భయపెట్టిన చిత్రం ‘చంద్రముఖి’. ఇప్పుడు దీనికి సీక్వెల్‌గా ‘చంద్రముఖి 2’ సిద్ధమైన సంగతి తెలిసిందే. రాఘవా లారెన్స్‌, కంగనా రనౌత్‌ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి పి.వాసు దర్శకత్వం వహించారు. తాజాగా విడుదలైన ఈ సినిమా ట్రైలర్‌ సినిమాపై అంచనాలు పెంచింది. అయితే ఇప్పుడీ సినిమాకు సంబంధించిన ఓ ఆసక్తికర అంశం ప్రస్తుతం సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తోంది. 

‘చంద్రముఖి 2’లో ప్రధానపాత్ర కోసం చిత్రబృందం మొదట సాయిపల్లవిని (Sai Pallavi) సంప్రదించిందట. కళ్లతో హావాభావాలు పలికించగల నాయికల్లో సాయిపల్లవి ముందు వరుసలో ఉంటుంది. దీంతో ఆమె అయితే ‘చంద్రముఖి 2’ లీడ్‌ రోల్‌కు సరిపోతుందని మేకర్స్‌ భావించారట. ఈ విషయమై సాయి పల్లవితో సంప్రదింపులు కూడా జరిపారట. అయితే కొన్ని కారణాల వల్ల ఆమె ఈ సినిమాను తిరస్కరించారని వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో ఈ అవకాశం కంగనా రనౌత్‌ను వరించిందని అంటున్నారు. ఒకవేళ సాయి పల్లవి ఇందులో నటించి ఉంటే తన డ్యాన్స్‌, నటన కచ్చితంగా సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచేవని ఆమె అభిమానులు అంటున్నారు. తాజాగా విడుదలైన ‘చంద్రముఖి 2’ ట్రైలర్‌లో కంగనా కూడా తనదైన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. అవకాశం అడిగి మరీ ఇందులో నటించినట్లు కంగన తెలపడం విశేషం. సెప్టెంబర్‌ 15న విడుదల కానుంది. 

అరుదైన అవకాశం దక్కించుకున్న అలియా భట్‌ చిత్రం.. అదేంటంటే?

ఇక చిరంజీవి (Chiranjeevi) నటించిన ‘భోళా శంకర్’లో ఆయన చెల్లెలి పాత్ర కోసం కూడా చిత్రబృందం మొదటగా సాయి పల్లవిని సంప్రదించింది. అయితే ఇది రీమేక్ సినిమా కావడంతో ఆ పాత్రను తిరస్కరించినట్లు తెలిసింది. దీంతో ఆ అవకాశం కీర్తి సురేశ్‌ తలుపు తట్టింది. ఈ సినిమా ఫలితాన్ని పక్కనపెడితే చిరంజీవి- కీర్తి సురేశ్‌ల నటనకు మంచి ప్రశంసలు దక్కాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని