Jailer: ‘జైలర్‌’ కొత్త రికార్డు.. అక్కడ తొలి స్థానం కైవసం

రజనీకాంత్‌- దర్శకుడు నెల్సన్‌ దిలీప్‌ కుమార్‌ కాంబోలో తెరకెక్కిన చిత్రం ‘జైలర్‌’. ఈ సినిమా సరికొత్త రికార్డు సృష్టించింది. అదేంటంటే?

Published : 14 Sep 2023 01:54 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: రజనీకాంత్‌ (Rajinikanth) హీరోగా దర్శకుడు నెల్సన్‌ దిలీప్‌ కుమార్‌ తెరకెక్కించిన ‘జైలర్‌’ (Jailer) సినిమా సరికొత్త రికార్డు సృష్టించింది. మలేషియా బాక్సాఫీసు వద్ద అత్యధిక వసూళ్లు (గ్రాస్‌) సాధించిన ఇండియన్‌ ఫిల్మ్‌గా సత్తా చాటింది. ఈ చిత్రాన్ని ఓవర్సీస్‌లో విడుదల చేసిన అయ్యంగరన్‌ ఇంటర్నేషనల్‌ సంస్థ సోషల్‌ మీడియా వేదికగా ఈ విషయాన్ని వెల్లడించింది. 2015లో విడుదలైన షారుక్‌ ఖాన్‌ ‘దీవాలే’ ఇప్పటి వరకు తొలి స్థానంలో నిలవగా ‘జైలర్‌’ తాజాగా దాన్ని వెనక్కి నెట్టింది. అయితే, ‘జైలర్‌’.. మలేషియన్‌ బాక్సాఫీసు వద్ద ఎంత కలెక్ట్‌ చేసిందో సదరు సంస్థ తెలపలేదు.

మలేషియా ప్రధానిని కలిసిన రజనీకాంత్.. ఏం మాట్లాడారంటే?

ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా రూ. 600 కోట్లకుపైగా వసూళ్లు చేసినట్లు నిర్మాణ సంస్థ సన్‌ పిక్చర్స్‌ ప్రకటించిన సంగతి తెలిసిందే. మంచి లాభాలు తెచ్చిపెట్టడంతో నిర్మాత కళానిధి మారన్‌.. రజనీకాంత్‌, నెల్సన్‌, సంగీత దర్శకుడు అనిరుధ్‌కు విలువైన కార్లను కానుకగా అందించారు. ఇతర నటులు, సాంకేతిక బృందానికి గోల్డ్‌ కాయిన్స్‌ ఇచ్చారు. ప్రస్తుతం ఓటీటీ ‘అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో’ (Amazon Prime Video)లో స్ట్రీమింగ్‌ అవుతోంది. కన్నడ నటుడు శివ రాజ్‌కుమార్‌, మలయాళ నటుడు మోహన్‌ లాల్‌, బాలీవుడ్‌ నటుడు జాకీ ష్రాఫ్‌ తదితరులు అతిథి పాత్రలు పోషించడం సినిమాకు ప్రత్యేక ఆకర్షణ. రమ్యకృష్ణ, తమన్నా, సునీల్‌, వసంత్‌ రవి, మిర్నా మేనన్‌, యోగిబాబు కీలక పాత్రలు పోషించి మెప్పించారు. టైగర్‌ ముత్తువేల్‌ పాండియన్‌గా రజనీ హీరోయిజం, వర్మన్‌గా వినాయకన్‌ విలనిజం ఓ స్థాయిలో పండాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని